AP Rains: ప్రజలకు అతి భారీ వర్షాల హెచ్చరిక.. అక్కడ పాఠశాలలకు నేడు సెలవు!

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతుంది. వచ్చే 2-3 రోజుల్లో మరింత బలపడి ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఇవాళ ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది..

AP Rains: ప్రజలకు అతి భారీ వర్షాల హెచ్చరిక.. అక్కడ పాఠశాలలకు నేడు సెలవు!
AP Rains
Follow us

|

Updated on: Jul 19, 2024 | 7:30 AM

అమరావతి, జులై 19: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతుంది. వచ్చే 2-3 రోజుల్లో మరింత బలపడి ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఇవాళ ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద ప్రవహించే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం ప్రజలు చేయరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నట్లు తెలిపారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద ఉండరాదని సూచించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ

మరోవైపు గురువారం సాయంత్రం 7 గంటల నాటికి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో 137మిల్లీమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది. కొయ్యలగూడెంలో 111మిమీ, కోనసీమ జిల్లా మండపేటలో 96మిమీ, తూర్పుగోదావరి జిల్లా కడియంలో 92మిమీ, నిడదవోలులో 91మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో 18 ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. 85 ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాధ్ హెచ్చరికలు జారీ చేశారు.

24 గంటల్లో బలపడనున్న అల్పపీడనం..

బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతుంది. ఉత్తర బంగాళా ఖాతంలో కేంద్రికృతం కానుంది. ఈ క్రమంలో 24 గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ తరువాత వచ్చే 24గంటల్లో వాయువ్య దిశగా పయనించి ఒడిశా తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్ప పీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీంతో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ రోజు ఏపీలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. అల్లూరి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు, అలాగే బాపట్ల, గుంటూరు, పల్నాడు కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, అల్లూరి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాలోని మిగిలిన జిల్లాలు, కర్నూలు, రాయలసీమలోని నంద్యాలలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు కోస్తాలోని కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీసే ఛాన్స్‌ ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లోద్దని అధికారులు సూచించారు.

ఇవి కూడా చదవండి

నేడు ఏలూరు జిల్లా పాఠశాలలకు సెలవు

భారీ వర్షాల నేపథ్యంలో నేడు మన్యంలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఏజెన్సీ మండలాల్లో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా ఐటీడీఏ పి ఓ సూర్య తేజ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఇక బెజవాడని ముసురు కామ్మేసింది. అక్కడ నిన్నటి నుండి ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. రాష్ట్రంలో వర్షాలు‌ తీవ్రంగా నమోదు కావడంతో అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు అలెర్ట్ చేశారు. సీఎంవో అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఏలూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి ముఖ్య సూచనలు జారీ చేశారు. పెద్దవాగుకు రెండు చోట్ల గండిపడే ప్రమాదని, ప్రాణ నష్టం, పశు నష్టం జరగకుండా చూడాలని అధికారులకు సీఎం ముందస్తు ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో 15 గ్రామాలు, తెలంగాణలో 3 గ్రామాల్లో వరద నీరు చేరే ప్రమాదం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ప్రజలకు అతి భారీ వర్షాల హెచ్చరిక.. అక్కడ పాఠశాలలకు నేడు సెలవు!
ప్రజలకు అతి భారీ వర్షాల హెచ్చరిక.. అక్కడ పాఠశాలలకు నేడు సెలవు!
కన్వర్ యాత్ర మార్గంలో పోలీస్ రూల్స్.. విరుచుకుపడుతున్న విపక్షాలు
కన్వర్ యాత్ర మార్గంలో పోలీస్ రూల్స్.. విరుచుకుపడుతున్న విపక్షాలు
అన్ని శాఖల్లో నిధుల కొరత.. సర్కార్ గట్టెక్కేదెలా..?
అన్ని శాఖల్లో నిధుల కొరత.. సర్కార్ గట్టెక్కేదెలా..?
కమ్ముకొస్తున్న చిమ్మచీకట్లు.. రాగల 24 గంటల్లో భారీ వర్షాలు
కమ్ముకొస్తున్న చిమ్మచీకట్లు.. రాగల 24 గంటల్లో భారీ వర్షాలు
పాక్‌ను ఢీ కొట్టే భారత ప్లేయింగ్ 11 ఇదే.. ఓపెనర్లుగా తుఫాన్ జోడీ
పాక్‌ను ఢీ కొట్టే భారత ప్లేయింగ్ 11 ఇదే.. ఓపెనర్లుగా తుఫాన్ జోడీ
బంగ్లాలోని భారతీయులకు ఎంబసీ ఎమర్జెన్సీ అడ్వైజరీ జారీ!
బంగ్లాలోని భారతీయులకు ఎంబసీ ఎమర్జెన్సీ అడ్వైజరీ జారీ!
తిరుమలలో కల్తీ ఫుడ్ కలకలం.. పలు హోటళ్లని తనిఖీ చేసిన ఈవో..
తిరుమలలో కల్తీ ఫుడ్ కలకలం.. పలు హోటళ్లని తనిఖీ చేసిన ఈవో..
ఏ క్షణమైనా తెలంగాణ TGPSC గ్రూప్‌ 2 పరీక్ష వాయిదా.. కారణం ఇదే
ఏ క్షణమైనా తెలంగాణ TGPSC గ్రూప్‌ 2 పరీక్ష వాయిదా.. కారణం ఇదే
Horoscope Today: వారికి ఆదాయం బాగా పెరిగే అవకాశం..
Horoscope Today: వారికి ఆదాయం బాగా పెరిగే అవకాశం..
డిజిటల్ ఇండియా మిషన్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు.. కేంద్ర మంత్రి
డిజిటల్ ఇండియా మిషన్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు.. కేంద్ర మంత్రి