ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. మద్యం ప్రియులు పండగ చేసుకున్నారు. మద్యం ధరలు తగ్గడంతో తొలిరోజు మందుబాబులు ఉత్సాహంగా ఉదయం నుంచే షాపుల దగ్గర క్యూ లైన్లు కట్టారు. సాయంత్రం 7 గంటల వరకు అమ్మకాలు కొనసాగాయి. ఎక్కువ జిల్లాల్లో తొలిరోజు స్టాక్ మొత్తం ఖాళీ చేసినట్లు తెలుస్తోంది. తొలిరోజే రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. ఎపీలో మద్యం ధరలు తగ్గాయి.. మందుబాబులు సంబరాలు చేసుకున్నారు. ఇక ప్రకాశంజిల్లా సింగరాయకొండలో మద్యందుకాణం ముందు మందుప్రియులు హారతులు పట్టి కొబ్బరికాయులు కొట్టి తమ ఆనందం వ్యక్తం చేశారు. పాటలు పాడుతూ మద్యం మత్తులో తూగుతూ తగ్గించిన ధరలతో మద్యం తాగుతుంటే ఆ కిక్కే వేరప్పా… అంటూ హారతులు పట్టారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి మద్యం దుకాణంలోకి ఆడుగుపెట్టారు. ఆనందం వచ్చినా.. ఆగ్రహం వచ్చినా.. మందుబాబులను కట్టడి చేయలేం… సింగరాయకొండలో అదే జరిగింది. ఎంతైనా టాక్స్
పేయర్స్ కదా.. అంటూన్నారు మందుబాబులు.