High Tension: కర్నూలు జిల్లా ఆత్మకూరులో ఉద్రిక్తత.. పోలీసుల మోహరింపు..

కర్నూలు జిల్లా ఆత్మకూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవ ఉద్రికత్తకు కారణంగా మారింది. శనివారం సాయంత్రం జరిగిన గొడవ చివరికి పోలీస్టేషన్ ముట్టడికి కారణంగా..

High Tension: కర్నూలు జిల్లా ఆత్మకూరులో ఉద్రిక్తత.. పోలీసుల మోహరింపు..
High Tension
Follow us

|

Updated on: Jan 09, 2022 | 1:57 PM

కర్నూలు జిల్లా ఆత్మకూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవ ఉద్రికత్తకు కారణంగా మారింది. శనివారం సాయంత్రం జరిగిన గొడవ చివరికి పోలీస్టేషన్ ముట్టడికి కారణంగా మారింది. ఆందోళనలకు కంట్రోల్ చేసేందుకు పట్టణంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. పోలీస్టేషన్ ముట్టడించి ఓ వర్గంవారిని చెదరగొట్టేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలయ్యాయి.  ఓ సమయంలో పోలీసులపైకి రాళ్లతో దాడికి దిగారు. పోలీస్ స్టేషన్ కాంపౌండ్ లోనే అనేక వాహనాలు దగ్ధమయ్యాయి. అదనపు బలగాలను మోహరించారు. పోలీస్ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

పలువురు పోలీసులు కూడా గాయాలపాలయ్యారు. పరిస్థితిని దారిలోకి తెచ్చేందుకు ఒక వర్గానికి పోలీసులు హామీ ఇవ్వడంతో కాస్త సద్దుమణిగింది. భారీ ఎత్తున పోలీసులు ఆత్మకూరు కు తరలి వచ్చాయి. పట్టణమంతా కలియతిరిగారు కవ్వింపు చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని  హెచ్చరించారు.

జరిగిన ఘటనపై బాధితులను పరామర్శించేందుకు నిజానిజాలను తెలుసుకునేందుకు కర్నూలు నుంచి ఆత్మకూరు వెళుతుండగా బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. మొత్తం మీద ఆత్మకూరులో పరిస్థితి కొంత కంట్రోల్ లోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి:  Technology News: గుడ్‌న్యూస్.. మీ WhatsApp ద్వారా UPI పిన్‌ రీసెట్ చేయవచ్చు.. ప్రాసెస్ ఎలానో తెలుసుకోండి..

Viral Video: ఈ బుజ్జి కోతి చేసిన పని చూస్తే మీరు కూడా నవ్వుకుంటారు.. నెట్టింట్లో తెగ వైరల్..