బ్యాంక్‌ నుంచి బయటకు వచ్చిన రైతుకు షాక్.. బైక్‌లో పెట్టిన రూ.2 లక్షలు మాయం!

యెమ్మిగనూరులో రైతు రంగారెడ్డికి షాక్ తగిలింది. కెనరా బ్యాంక్ నుంచి రూ.2 లక్షలు విత్‌డ్రా చేసి బైక్‌పై వెళ్తుండగా, దుండగుడు బ్యాంక్ నుంచే వెంబడించాడు. లక్ష్మీ స్వీట్స్ వద్ద బైక్ ఆపి లోపలికి వెళ్లిన సమయంలో, దుండగుడు బైక్‌లో పెట్టిన నగదును దొంగిలించాడు. బాధితుడు ఫిర్యాదు చేయగా, పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తూ దర్యాప్తు చేస్తున్నారు.

బ్యాంక్‌ నుంచి బయటకు వచ్చిన రైతుకు షాక్.. బైక్‌లో పెట్టిన రూ.2 లక్షలు మాయం!
Yemmiganur Theft

Updated on: Sep 26, 2026 | 2:10 PM

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో చోరీ కలకలం రేపింది. వైఎస్ఆర్ సర్కిల్ సమీపంలో ఒక రైతు కష్టపడి దాచుకున్న నగదును క్షణాల్లో దుండగుడు కాజేసి పరారయ్యాడు. రైతు రంగారెడ్డి కెనరా బ్యాంకులో తన ఖాతా నుండి రూ.2 లక్షల నగదు విత్‌డ్రా చేసుకుని బయలుదేరాడు. అయితే, బ్యాంకు నుంచే అతనిపై కన్నేసిన ఓ అపరిచిత వ్యక్తి రంగారెడ్డిని నిశితంగా వెంబడించాడు. బ్యాంక్ నుండి వచ్చిన రైతు, వైఎస్ఆర్ సర్కిల్‌లోని లక్ష్మీ స్వీట్స్ షాప్ ముందు తన బైక్‌ను నిలిపి లోపలికి వెళ్లాడు. సరిగ్గా అదే సమయాన్ని ఆసరాగా చేసుకున్న దుండగుడు.. క్షణాల వ్యవధిలో బైక్ ముందు ఉంచిన పెట్రోల్ ట్యాంక్ కవర్ లో ఉన్న రూ.2 లక్షల నగదును ఎత్తుకెళ్లిపోయాడు.

దుకాణం బయటకు వచ్చి చూసుకునేసరికి నగదు మాయమవ్వడంతో షాక్‌కు గురైన బాధితుడు రంగారెడ్డి, వెంటనే పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని, వైఎస్ఆర్ సర్కిల్ మరియు లక్ష్మీ స్వీట్స్ సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్పి క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us