Andhra Pradesh: ‘ఏనుగుల లెక్క తేలుస్తాం’.. దక్షిణాది రాష్ట్రాల సరిహద్దులో కీలక సర్వే చేపట్టిన అధికారులు

దక్షిణాది రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఎన్ని ఏనుగులు ఉన్నాయనే లెక్క తేల్చేందుకు అటవీ శాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న ఏనుగులతో పాటు మరికొన్ని కొత్త ఏనుగులు కలిసాయా? అవి ఏ ప్రాంతం నుంచి వచ్చాయి? వాటి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అరుదైన జంతువులను కాపాడుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే కోణంలో..

Andhra Pradesh: 'ఏనుగుల లెక్క తేలుస్తాం'.. దక్షిణాది రాష్ట్రాల సరిహద్దులో కీలక సర్వే చేపట్టిన అధికారులు
Elephant Census
Follow us

| Edited By: Basha Shek

Updated on: May 25, 2024 | 10:54 PM

దక్షిణాది రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఎన్ని ఏనుగులు ఉన్నాయనే లెక్క తేల్చేందుకు అటవీ శాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న ఏనుగులతో పాటు మరికొన్ని కొత్త ఏనుగులు కలిసాయా? అవి ఏ ప్రాంతం నుంచి వచ్చాయి? వాటి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అరుదైన జంతువులను కాపాడుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే కోణంలో ఈ సర్వే నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సర్వేలో బోర్డర్ లోని రాష్ట్రాల అధికారులు సైతం ఈ సర్వేలో పాల్గొంటారు. ఈ సర్వేలో రాష్ట్ర నిపుణులతో పాటు ఏనుగుల పరిరక్షణ రేంజర్ మరియు ఆ ప్రాంతంలోని అటవీశాఖ సిబ్బంది తప్పనిసరిగా పాల్గొనేలా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ సర్వే ఈనెల 23న మొదలై 25 తో ముగియనుంది. ఈ మూడు రోజుల్లో ఆంధ్ర తో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ సరిహద్దుల్లో ఏనుగుల లెక్కింపు సర్వే నిర్వహిస్తున్నారు. ఒకేసారి సర్వే చేపట్టడం వల్ల ఏనుగులు అటూ ఇటూ ప్రయాణించినా సర్వేలో తేడా రాదన్నది ప్రధాన ఉద్దేశం. దేశవ్యాప్తంగా ఏనుగుల సంతతి పెరుగుతున్న క్రమంలో గత ఏడాది 17 నుంచి 19 వరకు మొదటి విడత సర్వే నిర్వహించారు. మరల ఈ ఏడాది రెండు విడత సర్వే ఇప్పుడు జరుగుతుంది. ఈ సర్వే ద్వారా గుర్తించిన ఏనుగులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు అటవీ ప్రాంతంలో ఉన్న వన్యప్రాణులను సంరక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటారు.

జిల్లాలో ఈ సర్వే ద్వారా ఏనుగులతో పాటు అలుగు, పునుగుపిల్లి, కింగ్ కోబ్రా, కొండచిలువలను ఎక్కువగా గుర్తిస్తున్నారు. ఇందులో గ్రామీణ, గిరిశిఖర ప్రాంతాల్లో కొండచిలువలు కనిపించగానే గ్రామస్తులు భయంతో వాటిని హతమారుస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా కొండచిలువలు పార్వతీపురం, మక్కువ మండలాల్లోని కొండ, వాగుల ప్రాంతంలో ఉన్నాయని అధికారులు గుర్తించారు. మన్యం జిల్లాలో మొత్తం లక్షకు పైగా హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఇందులో 60 శాతం ఆర్ ఆర్ ఓ ఎఫ్ ఆర్ కిందే ఉంది. ఈ ప్రాంతంతో కలిపి ఉన్న మన్యం జిల్లాలో కొంతకాలంగా అటు ప్రజలకు, ఇటు అటవీ శాఖ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ఏనుగులు. వాటి వల్ల ప్రాణ, ఆస్తి నష్టం కూడా జరిగాయి. కొన్ని సందర్భాల్లో వివిధ కారణాలతో ఏనుగులు మృతి చెందిన ఘటనలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఏనుగులు రెండు గుంపులుగా విడిపోయి 11 ఏనుగులు జిల్లాలో సంచరిస్తున్నాయి. అయితే ప్రస్తుత సర్వే ఉన్న ఏనుగులు సంఖ్య పెరిగిందా? తగ్గిందా? అన్న విషయాలను సర్వే చేస్తారు. మూడు రోజుల్లో మూడు దశలుగా ఈ సర్వే నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మొదటిరోజు అటవీ సిబ్బంది సుమారు 15 కిలోమీటర్ల పరిధిలో జిగ్ జాగ్ విధానంలోనూ, రెండో రోజు రెండు కిలోమీటర్లు నిటారుగా ఒకే లైన్ లో వెళ్తూ, మూడో రోజు నీటి కోసం వచ్చే కుంటలు, చెరువులు వద్ద ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు క్షుణ్ణంగా పరిశీలించి గుర్తించడం చేస్తారు. ముఖ్యంగా ఏనుగుల అడుగుజాడలు, మలమూత్ర విసర్జన, సమూహం పరిమాణం ఆధారంగా వాటి సంఖ్య లెక్కిస్తారు. కనిపించిన ఏనుగులకు ఫోటోలు తీస్తారు. ఏనుగుల అవయవాలు లింగ నిర్ధారణ ద్వారా గుర్తించి వివరాలను నమోదు చేసుకోవటం సర్వేలోనే ప్రధాన అంశం. అనంతరం మూడు రోజుల పాటు జరిగిన సర్వే పూర్తి స్థాయి వివరాలను కేంద్ర అటవీ శాఖకు నివేదికను సమర్పిస్తారు. ప్రస్తుతం జరిగిన సర్వే వల్ల అరుదైన జాతుల వన్యప్రాణులను కాపాడుకోవడమే ప్రధాన ఏజెండాగా సాగిందని, ఈ సర్వేలో అనేక రకాల అరుదైన జాతులను కూడా గుర్తించామని అంటున్నారు జిల్లా అటవీశాఖ అధికారి ప్రసూన. ఈ సర్వే వల్ల కొన్ని అరుదైన ప్రాణుల జీవనానికి అధికారులు తోడ్పడేలా ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
పోలవరం నిర్మాణంపై సీఎం చంద్రబాబు సమీక్ష
పోలవరం నిర్మాణంపై సీఎం చంద్రబాబు సమీక్ష
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి దాదాపు పూర్తి.. మన దగ్గరే..
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి దాదాపు పూర్తి.. మన దగ్గరే..
ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు యువకుడు బలి.. పురుగుల మందుతాగి సూసైడ్‌
ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు యువకుడు బలి.. పురుగుల మందుతాగి సూసైడ్‌
హైదరాబాద్‌లో అర్థరాత్రి పోకిరీ బ్యాచ్‌ వీరంగం. ఇంటి ఓనర్ పై దాడి.
హైదరాబాద్‌లో అర్థరాత్రి పోకిరీ బ్యాచ్‌ వీరంగం. ఇంటి ఓనర్ పై దాడి.
5 లక్షలు డిపాజిట్‌ చేస్తే 10 లక్షలు.. డబ్బును రెట్టింపు చేసే పథకం
5 లక్షలు డిపాజిట్‌ చేస్తే 10 లక్షలు.. డబ్బును రెట్టింపు చేసే పథకం
అదుపు తప్పి అలకనంద నదిలో పడ్డ టెంపో.. 8 మంది మృతి.
అదుపు తప్పి అలకనంద నదిలో పడ్డ టెంపో.. 8 మంది మృతి.
ఎక్కువ ఇచ్చేశాం.. తిరిగి ఇచ్చేయండి.! వారికి ఎలన్ మస్క్‌ హెచ్చరిక!
ఎక్కువ ఇచ్చేశాం.. తిరిగి ఇచ్చేయండి.! వారికి ఎలన్ మస్క్‌ హెచ్చరిక!
‘సార్.. ఈ జాబ్ రాలేదంటే నా ప్రియురాలు నాకు దక్కదు’ వీడియో.
‘సార్.. ఈ జాబ్ రాలేదంటే నా ప్రియురాలు నాకు దక్కదు’ వీడియో.
అక్కో! నీ గుండె గట్టిదే. పామును కుర్‌కురే తిన్నట్టు.. కరకరా నమిలి
అక్కో! నీ గుండె గట్టిదే. పామును కుర్‌కురే తిన్నట్టు.. కరకరా నమిలి
అందుకే రైలు ప్రమాదం జరిగింది.. ప్రాథమికంగా నిర్ధారించిన రైల్వే
అందుకే రైలు ప్రమాదం జరిగింది.. ప్రాథమికంగా నిర్ధారించిన రైల్వే
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి దాదాపు పూర్తి.. మన దగ్గరే..
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి దాదాపు పూర్తి.. మన దగ్గరే..
హైదరాబాద్‌లో అర్థరాత్రి పోకిరీ బ్యాచ్‌ వీరంగం. ఇంటి ఓనర్ పై దాడి.
హైదరాబాద్‌లో అర్థరాత్రి పోకిరీ బ్యాచ్‌ వీరంగం. ఇంటి ఓనర్ పై దాడి.
అదుపు తప్పి అలకనంద నదిలో పడ్డ టెంపో.. 8 మంది మృతి.
అదుపు తప్పి అలకనంద నదిలో పడ్డ టెంపో.. 8 మంది మృతి.
ఎక్కువ ఇచ్చేశాం.. తిరిగి ఇచ్చేయండి.! వారికి ఎలన్ మస్క్‌ హెచ్చరిక!
ఎక్కువ ఇచ్చేశాం.. తిరిగి ఇచ్చేయండి.! వారికి ఎలన్ మస్క్‌ హెచ్చరిక!
‘సార్.. ఈ జాబ్ రాలేదంటే నా ప్రియురాలు నాకు దక్కదు’ వీడియో.
‘సార్.. ఈ జాబ్ రాలేదంటే నా ప్రియురాలు నాకు దక్కదు’ వీడియో.
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!