Janasena Pawan Kalyan: తుని ఘటనలో కాపులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan: తుని ఘటనలో కాపులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వారిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం..

Janasena Pawan Kalyan: తుని ఘటనలో కాపులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌
Follow us

|

Updated on: Jan 29, 2021 | 11:20 PM

Pawan Kalyan: తుని ఘటనలో కాపులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వారిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం కాపు సంక్షేమ సేన సమావేశం అనంతరం పవన్‌ మీడియాతో మాట్లాడారు. కులాలను ఓటు బ్యాంకుగా పరిగణించే కొద్ది ఆయా వర్గాలకు శాసించే పరిస్థితి రాదని అన్నారు. శాసించే స్థాయిలో ఉండాల్సిన కాపులు యోచించే స్థాయిలోనే ఉన్నారని వాపోయారు. రాజకీయంగా, సామాజికంగా కాపుల్లో, బీసీ కులాల్లో అసమానతలున్నాయని అన్నారు. కాపుల సమస్యల పరిష్కారం కోసం జనసేన అండగా ఉంటుందని పేర్కొన్నారు

రాష్ట్ర జనాభాలో 27 శాతం ఉన్న కాపులను ఓటు బ్యాంకుగా చూడడానికి ప్రతి రాజకీయ పార్టీ ఆమనేయాలని ఆయన హితవు పలికారు. తాను ఓ కులానికి ప్రతినిధి కాదని, అందరివాడినని అన్నారు. ఈ విషయాన్ని తాను పదేపదే చెబుతున్నానని చెప్పారు. ఉద్దానం కిడ్నీ, అమరావతిలో దళితుల సమస్యలపై పోరాడిన విషయాన్ని పవన్‌ కల్యాణ్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కులాల కార్పొరేషన్లు ఆయా వర్గాలకు తాయిలాలేనని ఆరోపించారు. ఆయా వర్గాల నేతల రాజకీయ సాధికారిత వైపు చూడకుండా చేసే పన్నాగమే కార్పోరేషన్ల ఏర్పాటని ఆయన వ్యాఖ్యానించారు.

Chiru Join in Janasena: జనసేనలోకి మెగాస్టార్ చిరంజీవి.. పవన్ కళ్యాణ్ రివీల్ చేసేశారు..

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..