
ఆందోళన, అత్యాశ.. మనిషిలో విచక్షణను చంపేస్తుంది. ఎంతదూరమైనా పరుగెత్తిస్తుంది. ఇప్పుడు పెట్రోల్ కొరత విషయంలో అదే జరుగుతోందా? మామూలు రోజులతో పోలిస్తే, శనివారం పెట్రోల్ 34 శాతం, డీజిల్ 16 శాతం డిమాండ్ పెరిగింది. ఆదివారం కూడా సగటున 22 శాతం డిమాండు పెరిగినట్టు లెక్క తేలింది. సోమవారమైతే పెట్రోల్ బంకుల దగ్గర క్యూలైన్లు, కన్జ్యూమర్ల కుస్తీలు, దాదాపు యుద్ధం సీన్లే. ఏపీలో మొత్తం పెట్రోల్ బంకులు 4 వేల 510. కానీ, సగానికి పైగా బంకుల్లో నోస్టాక్ బోర్డులే వెక్కిరిస్తున్నాయి. తిరుపతిలో 30 శాతం బంకులు మూతబడ్డంతో తిరుమలకూ తప్పలేదు డీజిల్ కష్టం. మంగళవారానికైనా పరిస్థితి మెరుగుపడుతుందా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు జనం. మిట్ట మధ్యాహ్నం.. మండుటెండ.. చుక్క చమురు కోసం తప్పవా తిప్పలు? రద్దీని తగ్గించడానికి బంకుల్లో రేషనింగ్ మంత్రం.. ఐనా అదే రొద! కన్‌జ్యూమర్ల కక్కుర్తి ప్లస్ క్రెడిట్ సిస్టమ్.. కొరతకు కారణాలెన్నో? డిపోల్లో కావల్సినంత చమురుంది, ఇక్కడైతే ఒక్క చుక్కకూ దిక్కు లేదు… ఎక్కడుంది లోపం? ఎందుకీ కటకట? మీ యుద్ధం ఐపోయిందో లేదో తెలీదు.. ఇక్కడ మా యుద్ధం మాత్రం భీకరంగా మొదలైంది. ఇక్కడ కుళాయి కాడ ఆడాళ్ల కొట్లాటకు నకలుగా మారింది పెట్రోల్ బంకుల దగ్గర వార్ సీన్లు. ...