Andhra Pradesh: కర్నూలు జిల్లాలో భారీ మోసం.. వారిని అస్సలు నమ్మొద్దంటూ జిల్లా ఎస్పీ విజ్ఞప్తి..

|

Aug 20, 2021 | 2:21 PM

Andhra Pradesh: కర్నూలు జిల్లాలో భారీ మోసం వెలుగు చూసింది. ఉద్యోగాల పేరుతో పలువురు యువకులకు భారీ స్థాయిలో కుచ్చుటోపీ పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అందినకాడికి..

Andhra Pradesh: కర్నూలు జిల్లాలో భారీ మోసం.. వారిని అస్సలు నమ్మొద్దంటూ జిల్లా ఎస్పీ విజ్ఞప్తి..
Arrested
Follow us on

Andhra Pradesh: కర్నూలు జిల్లాలో భారీ మోసం వెలుగు చూసింది. ఉద్యోగాల పేరుతో పలువురు యువకులకు భారీ స్థాయిలో కుచ్చుటోపీ పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అందినకాడికి దోచుకున్నారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న జిల్లా పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం నాడు.. జిల్లా ఎస్పీ సుధీకర్ కుమార్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. కర్నూలు జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నలుగురు వ్యక్తులు మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో అమాయకులను నమ్మించి భారీ స్థాయిలో డబ్బులు వసూలు చేశారు. ఓర్వకల్లు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని.. ఒక్కొక్కరి నుంచి ఏడు లక్షల చొప్పున కోటి రూపాయలు వసూలు చేశారు.

కర్నూలు డీఐజీ పేరుతో నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్ సృష్టించి.. ఉద్యోగార్థులను నమ్మించే ప్రయత్నం చేశారు. అలాగే రైల్వేలో ఉద్యోగాల పేరుతో అవుకు, అల్లూరులో రూ. 10 లక్షలు, 18 లక్షల 30 వేలు వసూలు చేశారు. కాగా, బాధితులు జరిగిన మోసాన్ని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు జరిపారు. ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై మూడు కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, నిరుద్యోగులు దళాలరును నమ్మొద్దని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ చెబుతున్న వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Also read:

Crime News: ఒళ్లు కొవ్వెక్కి తిక్క వేశాలు వేసిన ఈవెంట్ మేనేజర్.. గుడ్డలూడదీసి కొట్టిన యువతులు

మీ అరికాళ్లలో తరచు వాపు వస్తుందా ? అయితే అశ్రద్ధ చేయకండి.. ఈ వ్యాధుల లక్షణాలే..

SBI ATM క్యాష్ మెషిన్ నుండి డబ్బు డిపాజిట్ చేస్తున్నప్పుడు.. మధ్యలో నిలిచిపోతే ఇలా చేయాలి.. ఎలా ఫిర్యాదు చేయాలో తెలుసుకోండి ..