జగన్ పీఏని అంటూ ఫోన్..సీట్లు ఆఫర్..లక్షల్లో దోపిడి! నిందితులు అరెస్ట్!

సైబర్ క్రైమ్ నేరగాళ్లు బాగా తెలివిమీరిపోయారు. రోజుకో కొత్త పంథాను ఎన్నుకుని పోలీసులకు తలనొప్పులు తెస్తున్నారు. తాజాగా ప్రస్తుత ఏపీ సీఎం  జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన పీఏ పేరుతో నాయకులను మోసం చేసిన నలుగురు యువకులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ జిల్లాకు చెందిన పండరి విష్ణుమూర్తి, గంధవరపు తరుణ్‌, ఎం.జగదీష్‌, పి.జయకృష్ణ ముఠాగా ఏర్పడ్డారు. గతేడాది అక్టోబరులో వై.ఎస్‌.జగన్‌ పీఏ నంబర్ తెలుసుకున్నారు. స్పూఫింగ్ టెక్నాలజీ ద్వారా ఆ నంబర్‌తో ఉత్తరాంధ్రలోని […]

  • Ram Naramaneni
  • Publish Date - 2:05 pm, Sun, 28 July 19
జగన్ పీఏని అంటూ ఫోన్..సీట్లు ఆఫర్..లక్షల్లో దోపిడి! నిందితులు అరెస్ట్!

సైబర్ క్రైమ్ నేరగాళ్లు బాగా తెలివిమీరిపోయారు. రోజుకో కొత్త పంథాను ఎన్నుకుని పోలీసులకు తలనొప్పులు తెస్తున్నారు. తాజాగా ప్రస్తుత ఏపీ సీఎం  జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన పీఏ పేరుతో నాయకులను మోసం చేసిన నలుగురు యువకులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ జిల్లాకు చెందిన పండరి విష్ణుమూర్తి, గంధవరపు తరుణ్‌, ఎం.జగదీష్‌, పి.జయకృష్ణ ముఠాగా ఏర్పడ్డారు. గతేడాది అక్టోబరులో వై.ఎస్‌.జగన్‌ పీఏ నంబర్ తెలుసుకున్నారు. స్పూఫింగ్ టెక్నాలజీ ద్వారా ఆ నంబర్‌తో ఉత్తరాంధ్రలోని కొందరు నేతలకు ఫోన్ చేసి వైసీపీ టిక్కెట్లు ఇస్తామని బేరాలాడారు. వారి మాటలను నమ్మిన కొందరు నేతలు లక్షల రూపాయలు వారి బ్యాంక్ అకౌంట్లలో వేశారు.

అనుమానం వచ్చిన కొందరు జగన్ అనుచరల వద్దకు ఈ విషయం తీసుకెళ్లారు. తాము ఎవరికీ ఫోన్ చేయలేదని జగన్ పీఏ చెప్పడంతో మోసపోయామని తెలుసుకున్న నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను కోసం గాలింపు చేపట్టారు. ఇతర నేరాల కింద రాజమహేంద్రవరం పోలీస్‌స్టేషన్లో ఉన్న వీరిని శనివారం పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌ తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. నిందితులు కొంతకాలంగా ఇదే తరహా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు. వీరిపై వైజాగ్‌, శ్రీకాకుళం, ముమ్మిడివరంలో కేసులు ఉన్నాయని తెలిపారు.