గుంటూరు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కన్నుమూత..

గుంటూరు మాజీ ఎంపీ, ప్రముఖ రాజకీయ నేత రాయపాటి సాంబశివరావు కన్నుమూశారు. కొంతకాలంగా ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన, రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన రాయపాటి, ఆరుసార్లు ఎంపీగా ఎన్నికై పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన మృతి పట్ల రాజకీయ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

గుంటూరు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కన్నుమూత..
Rayapati Sambasiva Rao

Edited By:

Updated on: Nov 29, 2026 | 2:15 PM

గుంటూరు: ప్రముఖ రాజకీయ నేత, గుంటూరు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన, రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాయపాటి సాంబశివరావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. మొత్తం ఆరుసార్లు ఎంపీగా ఎన్నికై పార్లమెంటులో తనదైన ముద్ర వేశారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

రాయపాటి సాంబశివరావు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు.

  • 1982 నుంచి 1988 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.
  • 1996లో తొలిసారి గుంటూరు నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.
  • 1998లో మరోసారి ఎంపీగా విజయం సాధించారు.
  • 2004, 2009 ఎన్నికల్లో గుంటూరు నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచారు.
  • 2014లో తెలుగుదేశం పార్టీలో చేరి నరసరావుపేట ఎంపీగా విజయం సాధించారు. మొత్తంగా ఐదుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.
  • 1993లో రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు.

విద్యారంగానికి సేవలు:

రాజకీయాలతో పాటు విద్యారంగంలోనూ ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. గుంటూరులోని ఆర్‌వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌తో ఆయనకు అనుబంధం ఉంది. నాగార్జున ఎడ్యుకేషనల్ సొసైటీ, కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించారు. విద్యాసంస్థల అభివృద్ధికి కృషి చేశారు.

పారిశ్రామికవేత్తగా గుర్తింపు:

రాయపాటి సాంబశివరావు రాజకీయ నాయకుడిగానే కాకుండా పారవేత్తగా కూడా గుర్తింపు పొందారు. ముఖ్యంగా పొగాకు ఎగుమతుల రంగంలో ఆయన సేవలకు గుర్తింపు లభించింది. రాజకీయంగా ఆయన ప్రత్యేకత ఉంది. గుంటూరు, నరసరావుపేట ప్రాంతాల్లో ఆయనకు బలమైన రాజకీయ పరిచయాలు, అనుచరగణం ఉండేవి. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన, రాష్ట్ర విభజన పరిణామాల అనంతరం టీడీపీలో చేరారు.

Loading...
Unable to load recommendations.
Follow Us