లాయర్ తల పగిలింది.. మేము ప్రాణాలతో.. వస్తామో.. రామో..

నామినేషన్‌ వేసేందుకు వచ్చిన టీడీపీ నేతలను.. వైసీపీ నేతలు అడ్డుకున్నారని.. ఈ అంశంపై వారితో మాట్లాడేందుకు వెళ్తుంటే.. మేము ప్రయాణిస్తున్న.. మూడు కార్లలను పగలకొట్టి.. చిత్తు చిత్తుగా దాడులు చేశారన్నారని.. ఈ దాడిలో అడ్వకేట్ తలపగిలిందని..

  • Updated On - 2:05 pm, Wed, 11 March 20 Edited By:
లాయర్ తల పగిలింది.. మేము ప్రాణాలతో.. వస్తామో.. రామో..


టీడీపీ నేతలు బొండా ఉమ, బుద్దా వెంకన్న ప్రయాణిస్తోన్న కారుపై దాడి జరిగింది. కొందరు వ్యక్తులు పెద్ద, పెద్ద కర్రలతో వారిపై దాడికి తెగబడ్డారు. గుంటూరు జిల్లా మాచర్ల రింగ్ రోడ్ సెంటర్‌లో ఈ దాడి జరిగింది. నిన్న బోదెలవీడులో నామినేషన్ వేసేందుకు వచ్చిన టీడీపీ నేతలను అడ్డుకున్నారు వైసీపీ నేతలు. ఆ అంశంపైనే వారితో మాట్లాడేందుకు వెళ్లారు బొండా ఉమ, బుద్దా వెంకన్న. మొదట వారి కారుపై రాళ్ల దాడి జరిగింది. కానీ డ్రైవర్ కారు ఆపకుండా ముందుకు వెళ్లడంతో రింగ్ రోడ్ సెంటర్‌లో మళ్లీ పెద్ద, పెద్ద కర్రలతో దాడి చేశారు.

దీంతో ఈ ఘటనపై మాజీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మీడియా సమావేశం పెట్టి.. టీడీపీ నేత బోండా ఉమతో.. ఫోన్లో మాట్లాడించారు.ఈ ఘటనపై మాట్లాడిన బోండా ఉమ.. నామినేషన్‌ వేసేందుకు వచ్చిన టీడీపీ నేతలను.. వైసీపీ నేతలు అడ్డుకున్నారని.. ఈ అంశంపై వారితో మాట్లాడేందుకు వెళ్తుంటే.. మేము ప్రయాణిస్తున్న మూడు కార్లను ధ్వంసం చేసి.. చిత్తు చిత్తుగా దాడులకు పాల్పడ్డారన్నారు.

ఈ దాడిలో ఒక అడ్వొకేట్ తల పగిలిందని.. వైసీపీ కార్యకర్తల నుంచి తప్పించుకుని మార్కాపురం మీదుగా వెళ్తుండగా.. అక్కడి స్థానిక ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లతో ఎస్కర్ట్ ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. అయినా కూడా.. మార్గం మధ్యలో కారును ఆపి.. ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లపైనే కాకుండా.. డీఎస్పీ కూడా మీద కూడా దాడి చేశారని.. ఈ క్రమంలో మేము ప్రాణాలతో ఈ నియోజక వర్గం దాటి బయటకు వస్తామో.. రామో తెలీదని అన్నారు. స్థానికంగా పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసినా.. అక్కడికి కూడా వచ్చి అల్లరి మూకలు దాడి చేశాయని.. ప్రస్తుతం తీవ్ర గాయాలు గురై.. ఒళ్లంతా రక్తాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు బోండా ఉమ.

ఇది కూడా చదవండి: టీడీపీ నేతల కారుపై దాడి.. చంద్రబాబు ఫైర్

Read More: వేలానికి మాజీ మంత్రి గంటా ఆస్తులు..