ఈ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం.. సేవలు తాత్కాలికంగా నిలిపివేత

పొగ మంచు దట్టంగా కమ్ముకోవడంతో జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. గురువారం తెల్లవారుజాము నుండే ద‌ట్టమైన పొగ‌మంచు అలముకుంది. జిల్లాలోని జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, ఇబ్రహీంపట్నం, నందిగామ వంటి ప్రాంతాలతో పాటు విజయవాడ నగరాన్ని సైతం పొగ మంచు కమ్మేసింది.

ఈ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం.. సేవలు తాత్కాలికంగా నిలిపివేత
Gannavaram Airport

Edited By:

Updated on: Feb 16, 2024 | 11:50 AM

పొగ మంచు దట్టంగా కమ్ముకోవడంతో జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. గురువారం తెల్లవారుజాము నుండే ద‌ట్టమైన పొగ‌మంచు అలముకుంది. జిల్లాలోని జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, ఇబ్రహీంపట్నం, నందిగామ వంటి ప్రాంతాలతో పాటు విజయవాడ నగరాన్ని సైతం పొగ మంచు కమ్మేసింది. తెల్లవారుజాము నుండే దట్టంగా అలుముకుని ఉన్న మంచు కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరీ ముఖ్యంగా జాతీయ రహదారిపై కమ్ముకుని ఉన్న పొగ మంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు సైతం కనిపించని పరిస్థితి నెలకొంది. ఉదయం10 గంటలవుతున్నప్పటికీ పొగ మంచు తగ్గకపోవడంతో వాహనాలన్నీ హైవేలపై హెడ్లైట్లు వేసుకుని వెళ్తున్నాయి. చాలా ప్రాంతాలలో దట్టంగా పొగ మంచు ఉన్న కారణంగా వాహనాలను పక్కకు నిలుపుదల చేసి వెలుతురు కోసం ఎదురుచూస్తున్నారు డ్రైవర్లు.

ఇదే సమయంలో గన్నవరం విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు పొగ మంచు అడ్డంకిగా మారింది. రన్ వే పై సైతం పొగ మంచు దట్టంగా అలముకొని ఉన్న నేపథ్యంలో ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు నుంచి వచ్చే విమానాల రాకపోకలకు ఆలస్యం అవుతోంది. పొగ మంచు కారణంగా ఎయిర్ కంట్రోల్ అధికారులు విమానాల రాకపోకను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఈ నేపథ్యంలో ఇటు నేషనల్ హైవే పైన అటు విమానాశ్రయంలోనూ ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొన్నటి వరకు చలికాలం పోయి వేసవి కాలం మండే ఎండలు వచ్చాయనుకుంటే వాతావరణ పరిస్థితుల్లో నెలకొన్న గణనీయమైన మార్పుల కారణంగా తిరిగి పొగమంచు కమ్మెస్తోంది.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us