Deputy CM Pawan Kalyan: కాకినాడలో కొనసాగుతున్న డిప్యూటీ సీఎం పవన్ పర్యటన.. ఆ సభపైనే అందరి దృష్టి..

కాకినాడ జిల్లాలో మూడో రోజు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ పర్యటన కొనసాగుతోంది. ఉప్పాడ సముద్ర తీరానికి చేరుకొని కోతకు గురవుతున్న ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్‌ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు. మన్నటి వరకూ మంగళగిరిలోని డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ క్రమంలోనే తాను గెలిచిన నియోజకవర్గంలో మూడురోజులపాటు పర్యటన చేపట్టారు.

Deputy CM Pawan Kalyan: కాకినాడలో కొనసాగుతున్న డిప్యూటీ సీఎం పవన్ పర్యటన.. ఆ సభపైనే అందరి దృష్టి..
Deputy Cm Pawan Kalyan
Follow us

|

Updated on: Jul 03, 2024 | 11:52 AM

కాకినాడ జిల్లాలో మూడో రోజు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ పర్యటన కొనసాగుతోంది. ఉప్పాడ సముద్ర తీరానికి చేరుకొని కోతకు గురవుతున్న ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్‌ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు. మన్నటి వరకూ మంగళగిరిలోని డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ క్రమంలోనే తాను గెలిచిన నియోజకవర్గంలో మూడురోజులపాటు పర్యటన చేపట్టారు. తొలిరోజు పిఠాపురంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అర్హులైన వారికి పెన్షన్లు అందించారు. ఆ తరువాత రెండవ రోజు కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తాగునీరు, అడవులు పరిరక్షణపై ఫోకస్ పెట్టారు. అయితే మూడు రోజుల పర్యటనలో భాగంగా చివరి రోజు పలు కీలకమైన అంశాలపై దృష్టి సారించారు.

ఉప్పాడ సముద్ర తీరానికి చేరుకుని అక్కడి స్థానికులతో మాటామంతి నిర్వహించనున్నారు. కోతకు గురవుతున్న ప్రాంతాన్ని పరిశీలించి ప్రత్యమ్నాయ మార్గాలు చూపాలని అధికారులకు ఆదేశించనున్నారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసుందుకు కొన్ని నిర్ణయాలు తీసుకోనున్నారు. అక్కడి పర్యటన తరువాత తిరిగి పిఠాపురంకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం తన దృష్టికి వచ్చిన వివిధ ఫిర్యాదులు, సమస్యలపై అధికారులతో చర్చించి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టేందుకు ఆదేశాలు జారీ చేయనున్నారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన టీడీపీ, బీజేపీ నాయకులతో పవన్‌ భేటీకానున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ముఖ్యనాయకులు కార్యకర్తలు కూడా పాల్గొననున్నారు. అతరువాత సాయంత్రం 4 గంటలకు పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో వారాహి వాహనంపై బహిరంగసభ నిర్వహించనున్నారు. ఈ సభ వేదికగా తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌. ఆ వారాహి బహిరంగసభ ముగిసిన వెంటనే విజయవాడ బయల్దేరి వెళ్లనున్నారు. దీంతో మూడురోజుల పర్యటన సజావుగా ముగియనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

విజృంభిస్తున్న జికా వైరస్‌.. అప్రమత్తంగా లేకుంటే అంతే.!
విజృంభిస్తున్న జికా వైరస్‌.. అప్రమత్తంగా లేకుంటే అంతే.!
మీ కంటిచూపు షార్పా.? ఈ ఫోటోలో చిరుతను గుర్తిస్తే మీరే తెలివైనవారు
మీ కంటిచూపు షార్పా.? ఈ ఫోటోలో చిరుతను గుర్తిస్తే మీరే తెలివైనవారు
నిర్మలమ్మ పద్దుపైనే రియల్ ఎస్టేట్ రంగం ఆశలు..!
నిర్మలమ్మ పద్దుపైనే రియల్ ఎస్టేట్ రంగం ఆశలు..!
జియో, ఎయిర్‌టెల్ కొత్త చార్జీలు అమల్లోకి.. ఎప్పటి నుండి అంటే..
జియో, ఎయిర్‌టెల్ కొత్త చార్జీలు అమల్లోకి.. ఎప్పటి నుండి అంటే..
ఏపీ టెట్‌ 2024 పరీక్షకు ఉచిత కోచింగ్‌కు దరఖాస్తులు ఆహ్వానం
ఏపీ టెట్‌ 2024 పరీక్షకు ఉచిత కోచింగ్‌కు దరఖాస్తులు ఆహ్వానం
మాయలేడి వలలో తల్లి, ఇద్దరూ కూతుళ్లు.. కనికరించాలంటున్న తండ్రి..!
మాయలేడి వలలో తల్లి, ఇద్దరూ కూతుళ్లు.. కనికరించాలంటున్న తండ్రి..!
బాలీవుడ్‌పై ఫోకస్ పెడుతున్న తమిళ హీరోలు
బాలీవుడ్‌పై ఫోకస్ పెడుతున్న తమిళ హీరోలు
స్విగ్గీలో కూడా ఆ ఫీచర్‌ వచ్చేస్తోంది.. ఇకపై పేమెంట్స్ మరింత ఈజీ
స్విగ్గీలో కూడా ఆ ఫీచర్‌ వచ్చేస్తోంది.. ఇకపై పేమెంట్స్ మరింత ఈజీ
బడ్జెట్‌లో రైల్వేకు అధిక కేటాయింపులు..ఆ రైళ్ల గురించి కీలక ప్రకటన
బడ్జెట్‌లో రైల్వేకు అధిక కేటాయింపులు..ఆ రైళ్ల గురించి కీలక ప్రకటన
సారూ వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం.!
సారూ వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం.!