Cyclone Arnab: అమ్మో బుధవారం..! కోనసీమను వెంటాడుతున్న సముద్ర రాక్షసుడి భయం!

అమ్మో బుధవారం..! ఈ పేరు వినగానే కోనసీమ తీర ప్రాంత ప్రజలకు పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయా? సముద్రం ప్రశాంతంగా కనిపిస్తున్నా.. తీరంలో అలల ఉద్ధృతి పెరిగితే మాత్రం గుండెల్లో గుబులు మొదలవుతుంది! ఉప్పాడ నుంచి ఓడలరేవు వరకు.. సముద్రం అల్లకల్లోలంగా మారితే పరిస్థితి ఎలా ఉంటుందో గతంలో ఎన్నో ఘటనలు గుర్తుచేస్తున్నాయి. మూడు దశాబ్దాల నాటి చేదు అనుభవాల నుంచి ఇటీవలి తీర ప్రాంత పరిణామాల వరకు.. బుధవారం అనే రోజుతో కోనసీమకు నిజంగానే ఏదైనా ప్రత్యేకమైన సంబంధం ఉందా? లేక వరుసగా ఎదురైన కొన్ని ఘటనల వల్ల ఏర్పడిన భయమా? వెడ్‌నస్‌డే..! ది మాన్‌స్టర్ డే ఆఫ్ ఆంధ్రప్రదేశ్..! అంటూ వినిపిస్తున్న మాటల్లో వాస్తవమెంత? సముద్రంలో అలలు ఎందుకు ఎగసిపడతాయి? తీర ప్రాంతాలకు ఎలాంటి పరిస్థితుల్లో ముప్పు పొంచి ఉంటుంది? ఇప్పుడు తెలుసుకుందాం!

Cyclone Arnab: అమ్మో బుధవారం..! కోనసీమను వెంటాడుతున్న సముద్ర రాక్షసుడి భయం!
Cyclone Arnab Konaseema

Updated on: Oct 27, 2026 | 9:40 PM

ఎంతటి తీవ్రమైన తుఫాను అయినా తీరం దాటేటప్పుడు రెండుమూడు గంటలు.. మాగ్జిమమ్ ఆరేడు గంటలు. ప్రభావం అంతకుమించి ఉండదు. పుష్కరకాలం కిందట వైజాగ్‌ను చిదిమేసిన హుద్‌హుద్ తుఫాను కూడా రెండుగంటలకు మించి ఉనికిలోలేదు. కాకపోతే, దాని నుంచి కోలుకుని స్థిమితపడ్డానికి నాలుగైదు రోజులు పట్టింది. కానీ, ఒక తుఫాను తాకిడి ఏకధాటిగా 24 గంటలు కంటిన్యూ అయితే..? ఒక రోజంతా భీకరమైన ఈదురుగాలులు, భారీ వర్షం కురిస్తే.. దానితాలూకు ఎఫెక్ట్ ఊహకే అందనంత ఎత్తులో ఉంటుంది. ఇప్పుడు దూసుకొస్తున్న అర్నబ్ తుఫాన్ స్పాన్ 24 గంటలకు మించే పోతుంది. ఇదే ఇప్పుడు కోనసీమను భయపెడుతున్న మొట్టమొదటి ప్రమాద హెచ్చరిక. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఏపీ వైపు దూసుకొస్తోంది అర్నబ్‌ తుఫాన్‌. బుధవారం (అక్టోబర్ 27) మధ్యాహ్నానికల్లా కోనసీమ – యానాం మధ్య తీరం దాటతానంటోంది. క్రాస్ అయ్యే టైమ్‌లో రాక్షసావతారం ఎత్తుతానని హూంకరిస్తోంది. దానికి తగ్గట్టే ముందు రోజే భారీవర్షాలతో బరువైన సంకేతాలూ ఇచ్చిపడేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల స్పీడ్‌తో గాలి వీస్తేనే ఒకలాంటి భీతావహ స్థితి. చెట్లు – కొమ్మలు ఊగిపోతాయి. అర్నబ్‌ తుఫాన్‌ అంతకు మించి మూడింతలు. అంటే, గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగం. ఆ...

Loading...
Unable to load recommendations.
Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి