Corona: ఏపీలో కాస్త తగ్గిన పాజిటివ్ కేసులు.. ఆందోళన కలిగిస్తోన్న మరణాలు..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. ఈసారి పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గినా.. మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Corona: ఏపీలో కాస్త తగ్గిన పాజిటివ్ కేసులు.. ఆందోళన కలిగిస్తోన్న మరణాలు..
Coronavirus Cases In AP
Follow us

|

Updated on: May 21, 2021 | 7:10 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. ఈసారి పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గినా.. మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 92,231 శాంపిల్స్ పరీక్షించగా.. 20,937 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అటు నిన్న మహమ్మారి కారణంగా 104 మంది మృత్యువాతపడ్డారు. ఇక ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 15,42,079 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇందులో 2,09,156 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 20,811 మంది కోవిడ్ నుంచి కోలుకోవడంతో ఇప్పటిదాకా 13,23,019 మంది రికవర్ అయ్యారు.

అటు రాష్ట్రంలో మొత్తంగా 9904 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కాగా, తాజాగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరి(3475), చిత్తూరు(3063) జిల్లాల్లో వెలుగు చూశాయి. కాగా, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని.. ఒకవేళ వచ్చిన మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని ఏపీ స్టేట్ కోవిడ్ నోడల్ అధికారి అర్జా శ్రీకాంత్ సూచించారు.

Also Read:

ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్‌.. గాల్లో పల్టీలు కొట్టిన కారు.. షాకింగ్ దృశ్యాలు..

గగుర్పొడిచే దృశ్యం.. పామును సజీవంగా మింగేస్తోన్న మరో పాము.. వీడియో వైరల్.!

SBI కస్టమర్లకు అలర్ట్.. మీ అకౌంట్ నుంచి రూ.147 డెబిట్ అవుతున్నాయా.? క్లారిటీ ఇచ్చిన బ్యాంక్.!