ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇంట్లో చోరి జరిగింది. సత్తెనపల్లిలోని కోడెల నివాసంలో కరెంట్ పనికి సంబంధించి రిపేర్ చేసేదుందంటూ.. రాత్రి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించారు. అనంతరం ఇంట్లోని కంప్యూటర్‌ను చోరి చేశారు. అయితే గేట్ వద్ద ఉన్న వాచ్‌మెన్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. వాచ్‌మెన్‌ను తోసేసి కంప్యూటర్లతో పరారయ్యారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.