YSRCP: మ్యానిఫెస్టోను విడుదల చేసేందుకు సిద్దమైన సీఎం జగన్.. ప్రచార తేదీ ఖరారు..

ఏపీ సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ప్రకటనతో పాటు మేనిఫెస్టో విడుదల చేసేందుకు రంగ సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 16న.. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు అభ్యర్థుల తుది జాబితాతో పాటు ఎన్నికల మ్యానిఫెస్టో విడుదలకు సిద్ధం రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికల మేనిఫెస్టో విడుదల తరువాత ఎన్నికల రణరంగంలోకి నేరుగా దిగబోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వైసీపీ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల జాబితా తుది దశకు చేరింది. ఈనెల 16న.. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల పార్టీ అభ్యర్థుల తుది జాబితా విడుదల చేసేందుకు వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారు.

YSRCP: మ్యానిఫెస్టోను విడుదల చేసేందుకు సిద్దమైన సీఎం జగన్.. ప్రచార తేదీ ఖరారు..
Cm Jagan
Follow us

| Edited By: Srikar T

Updated on: Mar 14, 2024 | 3:48 PM

ఏపీ సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ప్రకటనతో పాటు మేనిఫెస్టో విడుదల చేసేందుకు రంగ సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 16న.. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు అభ్యర్థుల తుది జాబితాతో పాటు ఎన్నికల మ్యానిఫెస్టో విడుదలకు సిద్ధం రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికల మేనిఫెస్టో విడుదల తరువాత ఎన్నికల రణరంగంలోకి నేరుగా దిగబోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వైసీపీ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల జాబితా తుది దశకు చేరింది. ఈనెల 16న.. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల పార్టీ అభ్యర్థుల తుది జాబితా విడుదల చేసేందుకు వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఆశావహులు, అసంతృప్తులతో వైసీపీ జగన్ సమావేశమై అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. పార్టీలో అభ్యర్థులు ప్రకటించిన పలు స్థానాల్లో అసంతృప్తి వ్యక్తం అవుతూ ఉండటంతో వారిని పిలిచి చర్చిస్తున్నారు. పలు చోట్ల అభ్యర్థులను మార్చాలని సొంత పార్టీ నేతలు పట్టుబడుతున్న నేపథ్యంలో అసంతృప్తి నేతలతో సీఎం సమావేశమై చర్చించారు. కొందరికి హామీలిస్తూ మరికొందరిని బుజ్జగిస్తూ అసంతృప్తులను చల్లబరిచే ప్రయత్నాలు చేశారు. మూడు రోజుల్లో తుది జాబితా ప్రకటన దృష్ట్యా తమ సీట్లు ఉంటాయో లేదోనని పలువురు సిట్టింగ్‎లు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వైఎస్ జగన్ నేరుగా వారితో సమావేశం అవుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థుల జాబితా కసరత్తు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే 12 జాబితాలు విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్ మరికొన్ని నియోజకవర్గాల్లో ఇన్‎చార్జ్‎లను మార్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ తరుణంలో పలువురు ఆశావహులు సీఎం క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టారు. తమకు అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరారు. పార్టీ అభ్యర్థుల ఎంపికపై మరో మూడు రోజుల పాటు కసరత్తు చేయనున్న సీఎం జగన్ ఈ నెల 16 న పార్టీ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. అదే రోజున ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటించి తన తండ్రి వైఎస్ఆర్ ఘాట్ వద్ద తుది జాబితాను విడుదల చేయనున్నారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను పార్టీ లోని ఎస్సీ ,ఎస్టీ, మైనారిటీ బీసీ నేతలతో ప్రకటించేందుకు పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఇక తుది జాబితాలో ఎంత మంది సిట్టింగ్‎ల స్థానాలు గల్లంతవుతాయోనని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అభ్యర్థుల జాబితా ప్రకటనలతో కొంత కాలంగా వైసీపీలో పలు నియోజకవర్గాల్లో అసంతృప్తి జ్వాలలు రాజుకున్నాయి. పలు నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు రోడ్డెక్కి పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. పార్టీ ప్రకటించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా కొన్ని చోట్ల, పార్టీ సీటు కోసం ప్రయత్నిస్తోన్న ఆశావహులు కొన్నిచోట్ల ఆందోళనలు చేస్తున్నారు. వైసీపీలో రగులుతోన్న అసంతృప్తులు, అసమ్మతి వ్యవహారాలపై సీఎం జగన్ దృష్టి పెట్టారు. గ్రూపులు, వర్గాలతో ఆందోళనలు చేస్తోన్న నేతలను పిలిచి చర్చిస్తున్నారు. అధికారిక సమీక్షలు రద్దు చేసుకుని మరీ అభ్యర్థులు ఎంపిక మేనిఫెస్టో పై కసరత్తు ఎన్నికల ప్రచారానికి సంబంధించిన కార్యాచరణను రెడీ చేసే పుణ్యం ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే తన ప్రచారానికి సంబంధించి రూట్ మ్యాప్ సైతం సిద్ధం చేసుకున్న వైఎస్ జగన్ సమయాన్నిబట్టి ఒకే రోజులో అన్ని నియోజకవర్గాల్లో ప్రధానంగా పర్యటించే లాగా కార్యచరణ సిద్ధం చేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
మీరు కారు నడుపుతున్నారా? ఈ పత్రాలు లేకుంటే రూ.10 వేల జరిమానా!
మీరు కారు నడుపుతున్నారా? ఈ పత్రాలు లేకుంటే రూ.10 వేల జరిమానా!
క్లారిటీ ఇచ్చిన అజిత్.. పొంగల్ ట్రీట్ పక్కా !!
క్లారిటీ ఇచ్చిన అజిత్.. పొంగల్ ట్రీట్ పక్కా !!
ఒంటిపై ట్యాన్‌ తొలగించేందుకు అద్భుత స్క్రబ్‌లు..! మెరుపు ఖాయం
ఒంటిపై ట్యాన్‌ తొలగించేందుకు అద్భుత స్క్రబ్‌లు..! మెరుపు ఖాయం
ద్వాపర యుగం నాటి ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగం ఎక్కడంటే..
ద్వాపర యుగం నాటి ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగం ఎక్కడంటే..
షేవింగ్ ఫొటోలు షేర్ చేసిన స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
షేవింగ్ ఫొటోలు షేర్ చేసిన స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
ఆహారంలో వీటిని ఎక్కువుగా చేర్చుకుంటున్నారా ఆయుష్షు హారతి కర్పూరమే
ఆహారంలో వీటిని ఎక్కువుగా చేర్చుకుంటున్నారా ఆయుష్షు హారతి కర్పూరమే
ప్రభాస్‌ లైఫ్‌లోకి ప్రత్యేకమైన వ్యక్తా ?? టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ
ప్రభాస్‌ లైఫ్‌లోకి ప్రత్యేకమైన వ్యక్తా ?? టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ
దాడులకు ఉసిగొల్పిందెవరు? సిట్‌ రిపోర్ట్‌తో నిజాలు నిగ్గు తేలేనా?
దాడులకు ఉసిగొల్పిందెవరు? సిట్‌ రిపోర్ట్‌తో నిజాలు నిగ్గు తేలేనా?
ఆడుకుంటూ ఆడుకుంటూ కుప్పకూలిన చిన్నారి.. ఆ డాక్టర్‌ ఏం చేసిందంటే ?
ఆడుకుంటూ ఆడుకుంటూ కుప్పకూలిన చిన్నారి.. ఆ డాక్టర్‌ ఏం చేసిందంటే ?
వారానికి ఒకసారి బాతు గుడ్లు తింటే ఎన్ని లాభాలో తెలుసా..?
వారానికి ఒకసారి బాతు గుడ్లు తింటే ఎన్ని లాభాలో తెలుసా..?