Chicken Prices: చికెన్ లవర్స్‌కు పండగే.. భారీగా పడిపోయిన చికెన్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ కిలో ఎంతంటే..?

కార్తీక మాసం రానున్న క్రమంలో చికెన్, కోడిగుడ్ల ధరలు గణనీయంగా తగ్గుతున్నాయి. మొన్నటివరకు కిలో చికెన్ 300 రూపాయలు ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు 250 రూపాయలకే లభిస్తోంది. గుడ్ల ధరలూ దిగొచ్చాయి. మాంసాహార ప్రియులకు, హోటళ్లకు ఇది శుభవార్త కాగా, పౌల్ట్రీ రైతులకు ఆదాయం తగ్గింది.

Chicken Prices: చికెన్ లవర్స్‌కు పండగే.. భారీగా పడిపోయిన చికెన్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ కిలో ఎంతంటే..?
Chicken Prices

Updated on: Oct 31, 2026 | 8:54 AM

మాంసం ప్రియులకు భారీ శుభవార్త. చికెన్ ధరలు మళ్లీ పడిపోతున్నాయి. వారం రోజుల్లో భారీగా డౌన్ అయ్యాయి. గత వారంలో రూ.300 వరకు చేరుకోగా.. ఇప్పుడు కిలో రూ.250కి తగ్గుముఖం పడింది. వీకెండ్ వచ్చేయడంతో చికెన్‌కు మార్కెట్‌లో భారీ డిమాండ్ ఏర్పడుతుంది. ఈ పెరిగిన డిమాండ్‌తో చికెన్ ధరలు కూడా సాధారణంగా పెరుగుతుంటాయి. అయితే ప్రస్తుతం ధరలు దిగిరావడం వినియోగదారులకు ఊరట కల్గిస్తోంది. పౌల్ట్రీ మార్కెట్‌లో పూర్తిగా భిన్నమైన పరిస్థితి నెలకొంది. కార్తీక మాసం త్వరలో ప్రారంభం కానున్న క్రమంలో చికెన్, కోడిగుడ్ల వినియోగం భారీగా తగ్గిపోనుంది. దీని ఫలితంగా డిమాండ్ తగ్గడంతో ధరలు భారీగా పడిపోయాయి. రానున్న రోజుల్లో కార్తీక మాసం ప్రారంభం కానున్న క్రమంలో ధరలు మరింతగా పడిపోయే అవకాశముంటుందని వ్యాపారులు చెబుతున్నారు. చికెన్‌తో పాటు కోడిగుడ్ల ధరలు కూడా పడిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం చికెన్, కోడిగుడ్ల ధరలు ఎలా ఉన్నాయనేది చూద్దాం.

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ రేట్లు ఇవే..

-గత వారంలో కిలో చికెన్ రూ.300 వరకు చేరుకోగా.. ప్రస్తుతం రూ.50 మేర పడిపోయింది. అక్టోబర్ 31వ తేదీన హైదరాబాద్‌లో కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ.252 పలుకుతుండగా.. డ్రస్స్‌డ్ చికెన్ రూ.223, రిటైల్ లైవ్ బర్డ్ రూ.144, ఎక్స్ ఫారం లైవ్ బర్డ్ రూ.117గా ఉన్నాయి.

-ఇక కరీంనగర్ జోన్‌లో కేజీ స్కిన్‌లెస్ చికెన్ రూ.252కు లభిస్తుండగా.. డ్రస్స్‌డ్ చికెన్ రూ.223గా ఉంది. ఇక రిటైల్ లైవ్ బర్డ్ రూ.144, ఎక్స్ ఫారం లైవ్ బర్డ్ రూ.117 వద్ద కొనసాగుతున్నాయి.

-తెలంగాణతో పోలిస్తే ఏపీలో చికెన్ ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. విజయవాడ జోన్‌లో కిలో స్కిన్ లెస్ చికెన్ రూ.266గా ఉండగా.. డ్రస్స్‌డ్ స్కిన్‌తో రూ.236, రిటైల్ లైవ్ బర్డ్ రూ.152, ఫారం దగ్గర లైవ్ బర్డ్ రూ.125గా ఉంది.

కోడి గ్రుడ్ల ధరలు ఇలా..

కోడి గ్రుడ్ల ధరలు కూడా తెలుగు రాష్ట్రాల్లో కుప్పకూలాయి. విజయవాడ జోన్‌లో 12 గ్రుడ్ల ధరలు రూ.80గా ఉన్నాయి. ఇక హైదరాబాద్ జోన్‌లో కూడా రూ.80 పలుకుతున్నాయి.

చికెన్ ధరలు ఎందుకు పడిపోతున్నాయి..?

చికెన్, గుడ్ల ధరలు తగ్గడంతో మాంసాహార ప్రియులకు ఇది నిజంగా పెద్ద ఊరటగా చెప్పవచ్చు. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు ఇప్పుడు తక్కువ ధరలకే చికెన్, గుడ్లు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలకు కూడా సరుకుల ఖర్చు కొంత తగ్గే అవకాశం ఉంది.  అయితే ఈ ధరల తగ్గుదల కోళ్ల పెంపకం దారుల ఆదాయంపై ప్రభావం చూపుతుంది. తగ్గిన డిమాండ్, తగ్గిన ధరలు వారి లాభాల మార్జిన్‌ను గణనీయంగా తగ్గిస్తాయని చెప్పవచ్చు. కార్తీక మాసం ముగిసిన తర్వాత ప్రజల్లో మాంసాహార వినియోగం తిరిగి సాధారణ స్థాయికి వస్తే, చికెన్‌కు మళ్లీ డిమాండ్ పెరిగే అవకాశం ఉందని పౌల్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కోళ్ల సరఫరా, ఫీడ్ ధరలు, రవాణా ఖర్చులు, ఉత్పత్తి వ్యయం, డిమాండ్-సప్లై సమతుల్యత వంటి అనేక ఇతర అంశాలు చికెన్ ధరలను నిర్ణయించడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఒకవేళ డిమాండ్ మరింత తగ్గి సరఫరా మాత్రం కొనసాగితే చికెన్ ధరలు ఇంకాస్త తగ్గే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us