Andhra Pradesh: అర్ధరాత్రి కాలవలోకి దూసుకెళ్లిన కారు.. గాలింపు చర్యలు చేపట్టిన ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది

|

Aug 28, 2024 | 7:39 PM

మారేడుమాక గ్రామానికి చెందిన గుడిసె రాజేష్‌.. ప్రమాదవశాత్తూ కారుతో సహా కాలువలో పడిపోయాడు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఇది జరిగినట్టు తెలుస్తోంది.  మొదట కారులో ఎవరూ లేకపోవడంతో అనేక అనుమానాలు కలిగాయి. అయితే తన భర్త గల్లంతు అయ్యాడంటూ రాజేష్ భార్య ఫిర్యాదు చేయడంతో ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.

Andhra Pradesh: అర్ధరాత్రి కాలవలోకి దూసుకెళ్లిన కారు.. గాలింపు చర్యలు చేపట్టిన ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది
Car Drown In Eluru Canal
Follow us on

ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి  కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లి దగ్గర ఏలూరు కాలువలోకి దూసుకెళ్లింది టవేరా కారు. అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు గల్లంతైనట్టు గుర్తించారు. కంకిపాడు మండలం మారేడుమాక గ్రామానికి చెందిన గుడిసె రాజేష్‌.. ప్రమాదవశాత్తూ కారుతో సహా కాలువలో పడిపోయాడు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఇది జరిగినట్టు తెలుస్తోంది.  మొదట కారులో ఎవరూ లేరని భావించడంతో అనేక అనుమానాలు కలిగాయి. అయితే తన భర్త గల్లంతు అయ్యాడంటూ రాజేష్ భార్య ఫిర్యాదు చేయడంతో ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..