సూర్యుడు కరుణించినా..దక్కని దర్శనం

కరోనా మహమ్మారి మానవ మనుగడకే కాదు… జగతికి వెలుగునిచ్చే సూర్యుడిని సైతం వదలడం లేదు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీ అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంపై కరోనా ఎఫెక్ట్‌ పడింది. ప్రతి ఏటా ఆలయ గర్భ గుడిలో జరిగే అద్భుత సన్నివేశానికి కరోనా ఆటంకంగా నిలిచింది. శ్రీ అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రతి ఏటా మార్చి నెలలో 8, 9, 10 అక్టోబర్ 1, 2, 3, తేదీల్లో సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి, దక్షిణాయణం […]

సూర్యుడు కరుణించినా..దక్కని దర్శనం
Follow us

|

Updated on: Oct 01, 2020 | 4:52 PM

కరోనా మహమ్మారి మానవ మనుగడకే కాదు… జగతికి వెలుగునిచ్చే సూర్యుడిని సైతం వదలడం లేదు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీ అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంపై కరోనా ఎఫెక్ట్‌ పడింది. ప్రతి ఏటా ఆలయ గర్భ గుడిలో జరిగే అద్భుత సన్నివేశానికి కరోనా ఆటంకంగా నిలిచింది.

శ్రీ అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రతి ఏటా మార్చి నెలలో 8, 9, 10 అక్టోబర్ 1, 2, 3, తేదీల్లో సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి, దక్షిణాయణం నుంచి ఉత్తరాయణానికి స్థాన చలనం చెందుతాడు. ఈ ప్రక్రియలో ఉదయించే సూర్యుడి లేలేత కిరణాలు గర్భగుడిలో సాలగ్రామ శిలతో చేసిన మూల విరాట్ పై కొన్ని నిమిషాల పాటు కిరణ స్పర్శ జరుగుతంది. ఆ అద్భుతాన్ని తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు.

అయితే, ఈసారి కూడా ఆ సన్నివేశాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు. ఈ సారి కరోనా వైరస్ ప్రభావంతో ఆలయంలో కిరణ స్పర్శకు ఏర్పాటు చేయలేకపోయారు. దేవాలయం ప్రాంగణం కంటోన్మెంట్ జోన్ లో వుండటంతో 14 రోజుల పాటు దేవాలయం మూసి వేయాలని దేవాదాయ శాఖ ఆదేశాలున్నాయని అర్చకులు చెప్పారు. ఆ అద్భుత ఆవిషృతం వీక్షించాలంటే వచ్చే ఏడాది మార్చి వరకూ నిరీక్షించక తప్పదని అంటున్నారు.

ఈ ఏడాది ఎలాగైన తమకు ఆ అదృష్ట భాగ్యం కలుగుతుందని ఎన్నో ఆశలతో వచ్చారు భక్తులు. కానీ, కరోనా మహమ్మారి తమ ఆశలను అడియాశలు చేయడం చాలా బాధ కలిగించిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కిరణ స్పర్శ కళ్లారా వీక్షించేందుకు రెండు నెలల క్రితమే ప్లాన్ చేసుకొని వచ్చామని మరి కొందరు అంటున్నారు. కిరణ స్పర్శ జరిగేందుకు ఆకాశంలో కారు మబ్బులు సహకరించినా, కరోనా మాత్రం ఆటంకంగా నిలిచిందని తీవ్ర నిశాతో వెనుదిరిగారు భక్తులు.

Latest Articles