Andhra Pradesh: 6 నెలల్లోనే మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు.. పేద బతుకుల్లో పట్టరాని ఆనందం!

| Edited By: Srilakshmi C

Dec 31, 2024 | 10:29 AM

ఈ ఏడాది మేలో జరిగిన ఎన్నికల్లో కూటమి సర్కార్ ఘన విజయం సాధించి అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు రూ.4 వేల పింఛన్ పెంచడమే కాకుండా తొలి పింఛన్ తాడేపల్లిలోని ఓ లబ్ధిదారునికి ఇచ్చేందుకు అతని ఇంటికి స్వయంగా వెళ్లారు. అయితే ఆ సమయంలో ఇళ్లు కట్టుకోవడానికి లోన్ మంజూరు చేయగమని సీఎం చంద్రబాబుని అడగ్గా.. ఆ మేరకు చంద్రబాబు హామీ ఇచ్చారు..కానీ ఊహించని విధంగా కేవలం 6 నెలల్లోనే యేళ్ల తన కల సాకారం అవుతుందని ఆనాడు ఆ పేదమనసు అనుకోలేదు..

Andhra Pradesh: 6 నెలల్లోనే మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు.. పేద బతుకుల్లో పట్టరాని ఆనందం!
Concrete House To Poor Man
Follow us on

అమరావతి, డిసెంబర్‌ 31: కూటమీ ప్రభుత్వం కొలువుదీన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చేందుకు సిద్దమైంది. వీటితో పాటు మూడు నెలలకు గాను మరొక మూడు వేలు జత చేసి తొలి పెన్షన్ మొత్తం ఏడు వేల రూపాయలకు పెంచి ఇచ్చింది కూడా. అప్పట్లో సీఎం చంద్రబాబు ఏకంగా తాడేపల్లిలోని పాములు నాయక్ ఇంటికి వెళ్లి మొదటి పెన్షన్ లబ్దిదారులకు అందించారు. చంద్రబాబు పాములు నాయక్ ఇంటికి వెళ్లి వారికి పెన్షన్ అందించడమే కాకుండా.. వారిచ్చిన టీని కూడా సేవించారు.

అయితే చంద్రబాబు పాములు నాయక్ ఇంటికి వెళ్లిన సమయంలో.. అతనిది పూరి గుడిసె. దీంతో ఏం కావాలని లబ్దిదారులను చంద్రబాబు అడిగితే ఇల్లు కట్టించుకుంటాం లోన్ ఇవ్వాలని పాములు నాయక్ అడిగాడు. చంద్రబాబు వెంటనే అనుమతిస్తున్నట్లు పాములు నాయక్ కుటుంబానికి డబ్బు ఇవ్వబోగా.. వద్దన్న పాములు నాయక్ ఇల్లు కావాలని అడగటంతోనే చంద్రబాబు ఆ మేరకు హామీ ఇచ్చారు.

అయితే ఇది జరిగిన నెల రోజుల్లోనే స్థానిక టీడీపీ నేతలు పాములు నాయక్ ఇంటికి వెళ్లారు. అతని పూరి గుడిసెను తీసివేయించి కొంత ఇంటికి శంఖు స్థాపన చేశారు. ఈ రెండు మూడు నెలల్లోనే కొత్త ఇంటి నిర్మాణం పూర్తైంది. వచ్చే నెలలో గృహప్రవేశం చేసేందుకు పాములు నాయక్ సిద్దమయ్యారు. సీఎం హామీ ఇచ్చిన వెంటనే తన ఇల్లు నిర్మాణం పూర్తవ్వటంపై పాములు నాయక్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏన్నో ఏళ్లుగా సొంత ఇంటి కోసం వేచి చూస్తున్నామని, పెన్షన్ ఇచ్చేందుకు సీఎం రావడం.. తాము అడిగిన వెంటనే ఇల్లు నిర్మించి ఇవ్వడంతో.. తమ సొంత ఇంటి కల సాకారం అయిందన్నారు. సీఎం చంద్రబాబుకు, తమ నియోజకవర్గ ఎమ్మెల్యే లోకేష్‌కు ధన్యవాదాలు తెలిపారు. తమ గృహ ప్రవేశానికి చంద్రబాబును, లోకేష్‌ణు ఆహ్వానిస్తామన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.