ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. రాష్ట్రంలో కొన్ని చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు.. అలాగే మరోవైపు చలి పులి చంపేస్తోంది. అల్లూరి జిల్లాలోని పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. పొగమంచు దట్టంగా అలుముకుంది. స్థానికంగా మినుములూరు, అరకులో 12 డిగ్రీలు.. పాడేరులో 14 డిగ్రీలు, చింతపల్లిలో 16.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా ఉండనున్నాయి.
ఈరోజు, రేపు, ఎల్లుండి:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
ఈరోజు, రేపు:- తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఎల్లుండి:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
ఈరోజు, రేపు:- తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఎల్లుండి:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి