కనుమరుగైన కళతో వారి జీవితాలు విలవిల.. పూర్తి వివరాలు ఇలా..

| Edited By: Srikar T

Feb 25, 2024 | 7:54 PM

తోలుబొమ్మలాట బహుశా నిన్నటి, నేటి తరానికి తెలియని పేరు. టీవీలు, రేడియోలు లేని కాలంలో ఒక వెలుగు వెలిగిన ఆట ఇది. తెర వెనుక అచ్చం మనుషులు వలె ఆడే ఆట. బహుశా ఈ తోలు బొమ్మలాట చూసి కాబోలు సినిమా ఆలోచన వచ్చి ఉండచ్చు. ఎందుకంటే సినిమా తెరమీద కనిపిస్తే ఈ తోలు బొమ్మలాట తెర వెనుక నుంచి కనిపిస్తుంది.

కనుమరుగైన కళతో వారి జీవితాలు విలవిల.. పూర్తి వివరాలు ఇలా..
Leather Toys Art
Follow us on

తోలుబొమ్మలాట బహుశా నిన్నటి, నేటి తరానికి తెలియని పేరు. టీవీలు, రేడియోలు లేని కాలంలో ఒక వెలుగు వెలిగిన ఆట ఇది. తెర వెనుక అచ్చం మనుషులు వలె ఆడే ఆట. బహుశా ఈ తోలు బొమ్మలాట చూసి కాబోలు సినిమా ఆలోచన వచ్చి ఉండచ్చు. ఎందుకంటే సినిమా తెరమీద కనిపిస్తే ఈ తోలు బొమ్మలాట తెర వెనుక నుంచి కనిపిస్తుంది. అయితే సినిమాలు ప్రపంచానికి తెలియక ముందు ఒక వెలుగు వెలిగిన ఈ తోలుబొమ్మ లాట పాశ్చాత్య సాంస్కృతిలో ఎన్నో కనుమరుగు అయినట్లు ఈ తోలు బొమ్మ లాట కూడా కనుమరుగు అయిందని చెప్పవచ్చు. కానీ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి సందర్భంగా ఈ తోలుబొమ్మలాట ప్రదర్శిస్తూ ఆనాటి కళను గుర్తు చేస్తునే వున్నారు.

అంతరించి పోతున్న ఈ తోలుబొమ్మలాట కళను ఇప్పటికి నెల్లూరు జిల్లాలో అప్పుడప్పుడు ప్రదర్శిస్తూ వాటి ద్వారా వచ్చిన రాబడితో పొట్ట గడుపుకుంటున్నారు. కొందరు కళాకారులు మర్రిపాడు మండలం డీసీ పల్లిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. 30 సంవత్సరాలు క్రితం వారికి డీసీ పల్లిలో కమ్యూనిటీ హాల్ ఉండేది. అప్పట్లో ఈ కమ్యూనిటీ హాల్లో బొమ్మలతో ప్రదర్శన చేసేవారు. ఈ ప్రాంతానికి చెందిన కళాకారులు 2015లో విదేశాల్లో సైతం ఈ బొమ్మలాట ప్రదర్శన చేశారు. సినిమాల రాకతో తోలు బొమ్మలాట ప్రభావం కొంత తగ్గింది. కాలక్రమేణ టీవీలు రావడం, ఆ తర్వాత మొబైల్‌ ఫోన్ల ఆవిర్భావంతో ఈ బొమ్మలాట దాదాపుగా కనుమరుగైంది. చాలా ప్రాంతాల్లో తోలుబొమ్మలాట కళాకారులు, వారి వారసులు ప్రత్యామ్నాయ వృత్తులను ఆశ్రయించారు. దీంతో తర్వాతి తరం ఈ తోలు బొమ్మలాట కళకు దూరమైంది.

ఈ తోలు బొమ్మలాట కళాకారులు రామాయణం, భారతంలోని దాదాపు 30 ఘట్టాలను ప్రదర్శించేవారు. ప్రధానంగా భారతంలో విరాటపర్వం, భీష్మపర్వం, ద్రోణపర్వం, పద్మవ్యూహం, సైంధవ వధ, దానవీర శూర కర్ణ, శల్య, శకుని, భీమ, దుర్యోధన యుద్ధం, అశ్వమేధ యాగం, ప్రమీలార్జునీయం, విభీషణ విజయం, బబ్రువాహన చరిత్ర తదితర ఘట్టాలను బొమ్మలాట ద్వారా ప్రదర్శించేవారు. ఇక రామాయణంలో సుందరకాండ, లక్ష్మణమూర్ఛ, సతీసులోచన, ఇంద్రజిత్తు మరణం, రామరామ యుద్ధం, మహిరావణ చరిత్ర తదితర పురాణ గాథలను కూడా తోలు బొమ్మలాటలో ప్రాధాన్యత పొందాయి. ఈ తోలు బొమ్మలాట ప్రదర్శనకు పది మంది కళాకారులు అవసరం. హార్మోనియం, తబలా, డప్పు తదితర సంగీత వాయిద్యాలను వాయించేవారితోపాటు మిగిలిన వారు బొమ్మలు ఆడించడం, పద్యాలు పాడటం, అర్థం చెప్పేందుకు మరికొంతమంది కళాకారులు పనిచేసేవారు.

ఇవి కూడా చదవండి

రామాయణ, భారతంలోని మగ పాత్రలకు మగవాళ్లే పనిచేసేవారు. ఆడపాత్రలకు మహిళలు తెరవెనుక నాటకం వేసేవారు. మహిళలు సైతం పోటాపోటీగా పౌరాణిక ఘటనలను పద్యాల ద్వారా చెప్పి వినసొంపుగా అర్థాలు విడమరిచి చెప్పేవారు. తోలుబొమ్మలాటలో బొమ్మలు ఆడించడం ఒక కళ అయితే, వాటికి అనుగుణంగా పద్యాలు పాడి అర్థాలు చెప్పడం అంతకుమించిన కళ. ఈ బొమ్మలాట నాటకాల్లో సీరియస్ పాత్రలతోపాటు జుట్టుపోలిగాడు, బంగారక్క పాత్రలను సైతం సృష్టించి బొమ్మల ద్వారా హాస్యాన్ని పండించేవారు. మేక, గొర్రె, కొండగొర్రె తదితర జంతువుల చర్మాలను సేకరించి వాటిని శుభ్రపరిచి ఆరబెట్టుకుని ఆ తర్వాత వాటిపైన గోరుగల్లు సాధనంతో రామాయణానికి సంబంధించి రాముడు, సీత, ఆంజనేయుడు, అంగధుడు, సుగ్రీవుడు, రావణాసురుడు తదితర బొమ్మలు, భారతానికి సంబంధించి పాండవులు, కౌరవుల బొమ్మలు గీసుకునేవారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..