పేద ఎంపీ వివాహం..పార్టీ చేస్తుందా సాయం!

అరకు వైఎస్సార్‌సీపీ ఎంపీ గొడ్డేటి మాధవి వివాహ వేడుక 17న జరగనుంది. గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటకు చెందిన కుసిరెడ్డి శివప్రసాద్‌తో ఆమెకు నిశ్చితార్థం జరిగిందని ఎంపీ సోదరులు మహేశ్, ప్రసాద్‌ తెలిపారు. తెల్లవారుజాము 3.15 గంటలకు శరభన్నపాలెంలో వివాహం, విశాఖలో రిసెప్షన్‌ నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. కాగా అరకు లోక్‌సభ స్ధానం నుంచి పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎన్నికైన గొడ్డేటి మాధవి  పాతికేళ్ల ప్రాయంలోనే ఎంపీగా ఎన్నిక అయ్యారు. అంతేకాదు భారీ ఆధిక్యతతో ఎంపీగా విజయం సాధించారు. దేశంలోని […]

పేద ఎంపీ వివాహం..పార్టీ చేస్తుందా సాయం!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 05, 2019 | 12:57 PM

అరకు వైఎస్సార్‌సీపీ ఎంపీ గొడ్డేటి మాధవి వివాహ వేడుక 17న జరగనుంది. గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటకు చెందిన కుసిరెడ్డి శివప్రసాద్‌తో ఆమెకు నిశ్చితార్థం జరిగిందని ఎంపీ సోదరులు మహేశ్, ప్రసాద్‌ తెలిపారు. తెల్లవారుజాము 3.15 గంటలకు శరభన్నపాలెంలో వివాహం, విశాఖలో రిసెప్షన్‌ నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. కాగా అరకు లోక్‌సభ స్ధానం నుంచి పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎన్నికైన గొడ్డేటి మాధవి  పాతికేళ్ల ప్రాయంలోనే ఎంపీగా ఎన్నిక అయ్యారు. అంతేకాదు భారీ ఆధిక్యతతో ఎంపీగా విజయం సాధించారు.

దేశంలోని ఎంపీలందరిలో కెళ్లా అత్యంత తక్కువ ఆస్తి కలిగిన ఎంపీగా కూడా మాధవి రికార్డుల్లో ఉన్నారు. ఈ పేద, గిరిజన ఎంపీ గురించి జాతీయ మీడియా కూడా ప్రత్యేక కథనాలను ఇచ్చింది. ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్టు ఎంప్లాయ్‌గా, పీఈటీగా పని చేస్తున్న మాధవిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత అరకు నుంచి ఎంపీగా నిలబెట్టారు. ఈ ఎన్నికల్లో మాజీ కేంద్రమంత్రి, 30 సంవత్సరాల రాజకీయం అనుభవం ఉన్న కిశోర్‌చంద్రదేవ్‌ని ఆమె ఓడించారు. కాగా ఆమె వివాహానికి సీఎం జగన్ హాజరుకానున్నట్లు సమాచారం.

కాగా ఆవిడ గిరిజన కమ్యూనిటీకి చెందిన మహిళ కావడంతో ఆ సాంప్రదాయం ప్రకారమే వివాహాం జరగనున్నట్లు సమాచారం. మరి పేద ఎంపీ పెళ్లి కాస్త గ్రాండ్‌గా జరగడానికి పార్టీ వర్గాలు ఆర్ధికంగా సహాయం చేస్తాయో, లేదో చూడాలి.

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..