Watch Video: కూతురితో కలిసి స్టెప్పులేసిన మంత్రి ఆదిమూలపు సురేష్.. స్పెషల్ ఏంటంటే? వీడియో..

Adimulapu Suresh Dance Video: ఆయనో విద్యాశాఖ మంత్రి.. కూతురు పెళ్లిలో డ్యాన్స్‌తో హమ్ చేశారు. ఆయన డ్యాన్స్ చూసినవారంతా ఫిదా అవుతూ అభినందిస్తున్నారు. ఆయన ఎవరో కాదు.. ఆంధ్రప్రదేశ్

Watch Video: కూతురితో కలిసి స్టెప్పులేసిన మంత్రి ఆదిమూలపు సురేష్.. స్పెషల్ ఏంటంటే? వీడియో..
Adimulapu Suresh Daughter W

Updated on: Dec 18, 2021 | 3:34 PM

Adimulapu Suresh Dance Video: ఆయనో విద్యాశాఖ మంత్రి.. కూతురు పెళ్లిలో డ్యాన్స్‌తో హమ్ చేశారు. ఆయన డ్యాన్స్ చూసినవారంతా ఫిదా అవుతూ అభినందిస్తున్నారు. ఆయన ఎవరో కాదు.. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. మంత్రి సురేష్ కుమార్తె శ్రిష్టి వివాహం హైదరాబాద్‌లోని గోల్కొండ రిసార్ట్స్‌లో శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ వివాహ కార్యక్రమంలో సై సినిమాలో పాటకు మంత్రి సురేష్ కూతురు శ్రిష్టితో కలిసి స్టెప్పులేశారు. దీంతో స్టేజ్ కింద ఉన్నవారంతా ఈలలు వేస్తూ గోల చేశారు. ప్రస్తుతం మంత్రి డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. డ్యాన్సింగ్ టాలెంట్‌‌తో మంత్రి అదరగొట్టారని కితాబిస్తున్నారు.

ఈ వివాహా కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి భారతి రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. మంత్రిగా, రాజకీయ నేతగా రోజువారీ కార్యక్రమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే ఆదిమూలపు సురేష్ ఇలా కుమార్తె పెళ్లి వేడుకలో సరదాగా చిందులేస్తూ ఎంజాయ్ చేశారు. కాగా.. మంత్రి సురేష్ డ్యాన్స్ బావుందంటూ వైసీపీ అభిమానులు, కార్యకర్తలు పేర్కొంటున్నారు.

వీడియో.. 

Also Read:

Kamareddy Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు చిన్నారులతో సహా ఆరుగురు దుర్మరణం..

Electric Tractor: త్వరలో భారతీయ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ ట్రాక్టర్.. ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ..