అక్కడ వద్దనుకుంటే.. మరో చోట స్థలం కేటాయింపు.. వారికి ఏపీ ప్రభుత్వం సూపర్ గుడ్‌న్యూస్

జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కాలనీల్లో ఇళ్ల సమస్యలను పరిష్కరించేందుకు ముగ్గురు మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కాలనీల్లో ప్లాట్లు పొందిన లబ్ధిదారులు ఇళ్లు కట్టుకునేందుకు సుముఖంగా ఉన్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకొని, 45 రోజుల్లోపు సమస్య పరిష్కరించాలని ఆదేశించింది.

అక్కడ వద్దనుకుంటే.. మరో చోట స్థలం కేటాయింపు.. వారికి ఏపీ ప్రభుత్వం సూపర్ గుడ్‌న్యూస్
Chandrababu Naidu Reviews Jagananna Housing Layouts

Updated on: Oct 08, 2026 | 1:04 PM

జగనన్న కాలనీల్లోని ఇళ్ల స్థలాలపై కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ ప్లాట్లు పొందిన లబ్ధిదారులు ఇళ్లు కట్టుకునేందుకు సుముఖంగా ఉన్నారా లేదో తెలుసుకోవాలని, అక్కడ ప్లాట్లు వద్దనుకున్న వారికి మరో ప్రాంతంలో స్థలాల కేటాయింపును పరిశీలించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లబ్ధిదారులు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని నోటీసులు కూడా పంపనున్నారు. తాజాగా ఈ అంశంపై మంత్రులతో సమావేశమైన సీఎం చంద్రబాబు, వారికి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించేందుకు గృహనిర్మాణశాఖ మంత్రి పార్థసారథి, రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో పాటుగా మంత్రి కందుల దుర్గేష్, మంత్రి నాదెండ్ల మనోహర్‌లతో కమిటీని ఏర్పాటు చేశారు.

అయితే గత ప్రభుత్వంలో జగనన్న కాలనీల పేరుతో ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. కానీ కొందరు లబ్ధిదారులు అక్కడ సరైన సౌకర్యాలు లేవని, అక్కడ ఇళ్లు కట్టుకోవడం తమకు ఇష్టం లేదని తెలిపినట్లు మంత్రులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జగనన్న కాలనీల్లో ఖాళీగా ఉన్న ప్లాట్లను, లబ్ధిదారులు వద్దనుకున్న స్థలాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి, అర్హులైన ఇతరులకు కేటాయించాలని సీఎం చంద్రబాబు అన్నారు.

అలాగే ఇటీవల ఆవాస్ సర్వేలో భాగంగా 2 లక్షల మందికి ఇళ్ల స్థలాలు కావాలని గుర్తించారని, వాటి నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలన్నారు. అంతేకాదు గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల కోసం చేపట్టిన భూసేకరణలో జరిగిన అక్రమాలపై కూడా దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేవ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us