ఏపీ ప్రభుత్వానికి మరో అరుదైన గౌరవం.. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఏకంగా 11 అవార్డులు.. సీఎం అభినందనలు..

|

Oct 07, 2022 | 4:40 PM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి మరో అరుదైన గౌరవం లభించింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌ - 2022లో ఏంగా 11 అవార్డులు అందుకోవడం విశేషం. కేంద్ర ప్రభుత్వం అందించే స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులను కార్పొరేషన్‌ మేయర్లు, మున్సిపాల్టీల ఛైర్మన్లు, కమిషనర్లు, ఇతర అధికారులు..

ఏపీ ప్రభుత్వానికి మరో అరుదైన గౌరవం.. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఏకంగా 11 అవార్డులు.. సీఎం అభినందనలు..
Swachh Survekshan 2022
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి మరో అరుదైన గౌరవం లభించింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌ – 2022లో ఏంగా 11 అవార్డులు అందుకోవడం విశేషం. కేంద్ర ప్రభుత్వం అందించే స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులను కార్పొరేషన్‌ మేయర్లు, మున్సిపాల్టీల ఛైర్మన్లు, కమిషనర్లు, ఇతర అధికారులు అవార్డులను అందుకున్నారు. శుక్రవారం వీరంతా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా సీఎం అవార్డు గ్రహీతలను అభినందించారు. గార్భేజ్‌ ఫ్రీ సిటీస్‌ అవార్టు కేటగిరీలో 5 స్టార్‌ రేటింగ్ తిరుప‌తి, విశాఖ కార్పొరేష‌న్లకు దక్కాయి. ఇక విజయవాడకు క్లీన్‌ స్టేట్‌ క్యాపిటల్‌ కేటగిరీలో అవార్డు అందింది.

ఇక 50 వేల నుంచి లక్ష లోపు జనాభా ఉన్న మున్సిపాల్టీలకు సంబంధించి ఇన్నోవేషన్‌ అండ్‌ బెస్ట్‌ ప్రాక్టీసెస్‌ కేటగిరీలో పులివెందుల మున్సిపాలిటీకి అవార్డు వరించింది. 50 వేల నుంచి 1 లక్ష లోపు జనాభా ఉన్న మున్సిపాల్టీలకు సంబంధించి సిటిజన్‌ ఫీడ్‌ బ్యాక్‌ కేటగిరీలో పుంగనూరు మున్సిపాలిటీ అవార్డు దక్కింది. ఇండియన్‌ స్వచ్ఛతా లీగ్‌ కేటగిరీలో 15వేలలోపు జనాభా స్పెషల్ మెన్షన్‌ అవార్డు పొదిలికి దక్కింది. ఇండియన్‌ స్వచ్ఛతా లీగ్‌ కేటగిరీలో శ్రీకాకుళం కార్పొరేషన్‌ స్పెషల్ మెన్షన్‌ అవార్డు సాధించింది. ఇక 25 వేల నుంచి 50 వేలులోపు జనాభా ఉన్న మున్సిపాల్టీలకు సంబంధించి ఇన్నోవేషన్‌ అండ్‌ బెస్ట్‌ ప్రాక్టీసెస్‌ కేటగిరీలో సాలూరు మున్సిపాల్టీకి అవార్డు దక్కింది.

ఇవి కూడా చదవండి

పరిశుభ్రత దిశగా వేగంగా అడుగులు..

రాష్ట్రంలో పరిశుభ్రతే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం పురపాలక, పట్టణాభివృద్ధిశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరాల్లో పరిశుభ్రత, వేస్ట్ మేనేజ్‌మెంట్‌, పట్టణాల్లో సుందరీకరణ పనులు, టిడ్కో ఇళ్లు తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘వర్షాలు బాగా కురుస్తున్నాయి. మళ్లీ పట్టణాలు, నగరాల్లో రోడ్ల పరిస్థితిని పరిశీలించండి. సీజన్‌ ప్రారంభం కాగానే మళ్లీ డ్రైవ్‌ చేపట్టండి. మార్చి 31 కల్లా అన్నిరోడ్లనూ మళ్లీ బాగుచేయండి. గార్బేజ్‌ స్టేషన్ల కారణంగా పరిసరాల్లోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏమాత్రం ఉండకూదు. ప్రతి మున్సిపాల్టీలో కూడా వేస్ట్‌ ప్రాసెసింగ్‌ ప్రక్రియల అమలు తీరును పరిశీలించాలి. కృష్ణా రిటైనింగ్‌ వాల్‌ బండ్‌ను చెట్లు, విద్యుత్‌ దీపాలు, ఏర్పాటుచేసి అందంగా తీర్చిదిద్దాలి’ అని జగన్‌ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్‌ ప్లెక్సీలను నిషేధించిందని గుర్తు చేసిన ముఖ్యమంత్రి.. దానిని సంపూర్ణంగా అమలు చేయడానికి సంబంధిత వ్యాపారులతో కలెక్టర్లు సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. ప్లాస్టిక్‌ నుంచి క్లాత్‌ వైపు మళ్లడానికి కావాల్సిన ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు అవసరమైన విధంగా వ్యాపారులకు తోడుగా ఉండాలని సూచించారు. వారికి రుణాలు ఇప్పించి అండగా నిలవాలన్నారు. ఇప్పించిన రుణాలను సకాలంలో కట్టేవారికి ప్రభుత్వం నుంచే వడ్డీ రాయితీ కల్పించేలా ఆలోచనలు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..