YS Jagan: విద్యార్ధులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. డిజిటల్ లైబ్రరీల ఏర్పాటుకు శ్రీకారం..

|

Aug 03, 2021 | 5:27 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్‌ను బలోపేతం చేసే దిశగా ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రతీ...

YS Jagan: విద్యార్ధులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. డిజిటల్ లైబ్రరీల ఏర్పాటుకు శ్రీకారం..
Cm Jagan
Follow us on

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్‌ను బలోపేతం చేసే దిశగా ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రతీ గ్రామ పంచాయితీలోనూ డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతోంది. దీనిపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్ అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్టులతో పాటు అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన స్టడీ మెటీరియల్‌ డిజిటల్ లైబ్రరీల్లో అందుబాటులో ఉండాలని సూచించారు. డిజిటల్ లైబ్రరీలు ప్రైమరీ, సెకండరీ ఎడ్యుకేషన్‌తో పాటు గ్రాడ్యుయేట్‌ స్టూడెంట్స్‌కు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయని సీఎం జగన్ అన్నారు. అలాగే డిజిటల్ లైబ్రరీల నుంచి పని చేసుకునేలా సదుపాయాన్ని కల్పించాలని ఆయన చెప్పుకొచ్చారు. గ్రామ సచివాలయాలకు, రైతు భరోసా కేంద్రాలకూ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ పెట్టడమే కాకుండా.. నిరంతర నెట్ సౌకర్యాన్ని కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

కాగా, మొదట విడతలో భాగంగా 4530 డిజిటల్ లైబ్రరీలను నిర్మించాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఆగష్టు 15న పనులు మొదలుపెట్టేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి తెలిపారు. అప్పటిలోగా స్థలాలను గుర్తించాలన్నారు. అదే సమయంలో డిసెంబర్ కల్లా డిజిటల్ లైబ్రరీల పనులను పూర్తి చేయాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.

డిజిటల్‌ లైబ్రరీలలో హై-క్వాలిటీ ఇంటర్నెట్‌…

డిజిటల్‌ లైబ్రరీ బిల్డింగ్‌‌లలో కనీస సదుపాయాలతో పాటు మూడు డెస్క్‌టాప్‌లు, యూపీఎస్, డెస్క్‌టాప్‌ బార్‌కోడ్‌ ప్రింటర్, స్కానర్, లేజర్‌ ప్రింటర్‌, సాఫ్ట్‌వేర్, యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్, అన్‌లిమిలెడ్‌ బ్యాండ్‌విడ్త్‌ ఇంటర్నెట్‌ ఉండనున్నాయి. అటు స్టోరేజీకి సంబంధించి డేటా సెంటర్‌ల నిర్మాణం పూర్తి చేసి అందుబాటులో తీసుకురావాలని సీఎం ఆదేశించారు. కాగా, డిజిటల్ లైబ్రరీల్లో కనీస సదుపాయాలు, కంప్యూటర్‌ పరికరాల కోసం దాదాపుగా రూ.140 కోట్లకుపైగా ఖర్చు కానుందని ఏపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది.

Also Read:

భర్త వింత అలవాటు.. రోజుకు 4 గంటలు టాయిలెట్‌లోనే.. కారణం తెలిసి భార్య షాక్.!

నడిరోడ్డుపై యువతి హాల్‌చల్‌.. వ్యక్తిని ఎగిరెగిరి కొడుతూ రచ్చ.. హ్యష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌!

కుక్కను పట్టి నీళ్లలోకి లాగేసిన మొసలి.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఈ ఫోటోలో ఏ జీబ్రా ముందుకు ఉంది.? మొత్తం ఎన్ని ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.!

ఈ చిన్నారి సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్.. అబ్బాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్.. గుర్తుపట్టారా!