AP News: మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ.. ఏపీ ప్రభుత్వం బిగ్ అప్‌డేట్

ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ ఎప్పటినుంచి.? ఇప్పుడు ఈ అంశంపైనే కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఈ పధకానికి సంబంధించి త్వరలోనే విధివిధానాలను ఖరారు చేయనుందట ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు పధకం అమలుపై కసరత్తులు మొదలుపెట్టింది ఏపీ సర్కార్. ఆ వివరాలు ఇలా..

AP News: మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ.. ఏపీ ప్రభుత్వం బిగ్ అప్‌డేట్
RTC Free Bus Facility
Follow us

|

Updated on: Jul 28, 2024 | 1:14 PM

ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ ఎప్పటినుంచి.? ఇప్పుడు ఈ అంశంపైనే కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఈ పధకానికి సంబంధించి త్వరలోనే విధివిధానాలను ఖరారు చేయనుందట ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు పధకం అమలుపై కసరత్తులు మొదలుపెట్టింది ఏపీ సర్కార్. పల్లెవెలుగు, అల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్‌లతో పాటు విశాఖపట్నం, విజయవాడలోని సిటీ, మెట్రో బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీని అమలు చేసే యోచనలో ఉన్నారట.

ఇది చదవండి: బిల్డప్ బాబాయ్ అనుకునేరు.. బుల్డోజర్‌రా.! 22 సిక్సర్లతో ధోని శిష్యుడి ఊహకందని ఊచకోత.. ఎవరో తెల్సా

ఇదిలా ఉంటే.. సోమవారం సీఎం చంద్రబాబు రవాణా, ఆర్టీసీపై కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్ష అనంతరం మహిళల ఫ్రీ బస్సు జర్నీపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఇప్పటికే అధ్యయనం చేసిన ప్రభుత్వ అధికారులు.. ఇటీవల దానిపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందించినట్టు తెలుస్తోంది. ఏపీలోనూ ఫ్రీ బస్సు జర్నీని అమలు చేస్తే.. ప్రతీ నెలా ఏపీఎస్‌ఆర్టీసీపై రూ. 250 కోట్లు భారం పడుతుందని అంచనా వేశారు. కాగా, ప్రతీ రోజూ సుమారు 30 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుంటే.. వీరిలో 15 లక్షల మంది వరకు మహిళలు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ప్రైవేట్ పార్టులో నొప్పంటూ ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. ఎక్స్‌రే తీసి చూడగా కళ్లు బైర్లు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..