Mudragada: అధికార లాంచనాలతో ముద్రగడ అంత్యక్రియలు.. అధికారులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు

కాపు ఉద్యమకారుడు, వైసీపీ సీనియర్ నేత ముద్రడగ పధ్మనాభం మరణంపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన చేసిన ప్రజా సేవకు గౌరవార్ధంగా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

Mudragada: అధికార లాంచనాలతో ముద్రగడ అంత్యక్రియలు.. అధికారులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు
Mudragada Padmanabham State Funeral

Updated on: Jul 15, 2026 | 8:19 AM

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాపు ఉద్యమకారుడు, వైసీపీ సీనియర్ నేత ముద్రడగ పధ్మనాభానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై ఉదయం డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో చర్చించిన సీఎం చంద్రబాబు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులకి ఆదేశాలు కూడా జారీ చేశారు.

ఇదిలా ఉండగా ముద్రగడ మృతిపై పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు సంపాతం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతిపై ఏపీ గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ విచారం వ్యక్తం చేశారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఆయన అందించిన సేవలను గవర్నర్‌ గుర్తుచేశారు. ముద్రగడ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ముద్రగడ మరణవార్త విచారం కలిగించిందని CM చంద్రబాబు తెలిపారు. పద్మనాభం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా అన్నారు. ముద్రగడ పద్మనాభం తుది శ్వాస విడిచారని తెలిసి చింతిస్తున్నాని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ తెలిపారు. ‘ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

పద్మనాభం మృతిపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముద్రగడ కుమారుడు గిరిబాబును ఫోన్‌లో పరామర్శించారు. తనకు పితృసమానులైన ముద్రగడ మరణవార్త తీవ్రంగా కలచివేసిందని.. ఐదు దశాబ్దాలుగా విలువలకు కట్టుబడి ముద్రగడ రాజకీయాలు చేశారన్నారు. కాపు సామాజికవర్గానికి పెద్దదిక్కుగా నిలిచి అలుపెరగకుండా పోరాడారు. మంచికోసం ఎంతదూరమైనా వెళ్లే ధైర్యం ముద్రగడ సొంతం అంటూ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us