సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ కావడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయనిచ్చిన రియాక్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైసీపీ శ్రేణుల దాడిలో గాయపడిన ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించేందుకు కడపలో పర్యటించారు పవన్ కళ్యాణ్. అనంతరం మీడియాతో మాట్లాడుతుండగా.. బన్నీ అరెస్ట్‌పై స్పందించాలని ఓ విలేకరి అడగ్గా.. పవన్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ‘ఇది సంబంధం లేని ప్రశ్న. ఇక్కడ మనుషులు చచ్చిపోతుంటే సినిమాల గురించి ఏం మాట్లాడటం.? ఇంకా పెద్ద సమస్యల గురించి ప్రస్తావించండి. సినిమాను మించిన సమస్యలపై డిబేట్ పెట్టండి. అడగండి.’ పెద్ద మనసుతో ఆలోచించాలని పవన్ కళ్యాణ్ మీడియాను కోరారు.
మరోవైపు వైసీపీ శ్రేణులు ఎంపీడీవోపై చేసిన దాడిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వాళ్లకు వార్నింగ్ ఇచ్చిన ఆయన.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని.. అహం తగ్గించి అందరి లెక్కలు సరిచేస్తామని హెచ్చరించారు. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఎంపీడీవోను పరామర్శించిన పవన్.. ఆయన ఆరోగ్యం ఎలా ఉందనేది ఆరా తీశారు. ఆయన కుటుంబానికి తాను ఉన్నానని భరోసా ఇచ్చారు పవన్ కళ్యాణ్.
ఇది చదవండి: పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు.. ఏంటా అని రైతులు వెళ్లి చూడగా
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..