
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారనుంది. దిగువ ట్రోపో ఆవరణంలో వాయవ్య దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
సోమ, మంగళవారాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయి. ఒకటి రెండు చోట్ల మెరుపులు సంభవించే అవకాశముంది. 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. బుధవారం నాడు ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు కొనసాగుతాయి.
సోమ, మంగళవారాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశముంది. గాలుల వేగం 40-50 కిమీగా ఉంటుంది. బుధవారం ఒకటి రెండు చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
సోమవారం కొన్ని చోట్ల ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయి. మంగళవారం ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు కురిసే అవకాశముంది. బుధవారం ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉనప్పటికీ, బలమైన ఈదురుగాలులు వీస్తాయి.
పిడుగులు పడే అవకాశం ఉన్నందున వర్షం పడే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు చెట్ల కింద నిలబడకూడదని, సురక్షితమైన ప్రదేశాల్లో ఆశ్రయం పొందాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.