AP Municipal Polls: మున్సిపల్ ఎన్నికల ఎఫెక్ట్.. ధన్ పాల్ జగన్ అరెస్ట్.. తీవ్రంగా ఖండించిన టీడీపీ నేతలు..!

AP Municipal Elections: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు పోరు అపోయి.. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల జోరు కొనసాగుతోంది.

AP Municipal Polls: మున్సిపల్ ఎన్నికల ఎఫెక్ట్.. ధన్ పాల్ జగన్ అరెస్ట్.. తీవ్రంగా ఖండించిన టీడీపీ నేతలు..!
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Mar 09, 2021 | 6:26 PM

AP Municipal Elections: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు పోరు అపోయి.. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల జోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీ మధ్య రసవత్తరమైన రాజకీయాలు నడుస్తున్నాయి. తాజాగా కడప జిల్లాలోని మైదుకూరు పురపాలిక తెలుగుదేశం పార్టీ చైర్మన్ అభ్యర్థి జగన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ రోజు ప్రభుత్వ కార్యాలయంలోకి దూసుకెళ్లడమే కాకుండా.. అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ పోలీసులు జగన్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా శుక్రవారం నాడు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయితే, జగన్ అరెస్ట్ విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు పోలీసుల తీరుపై భగ్గమంటున్నాయి. అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారంటూ దుయ్యబట్టారు.

ఇక టీడీపీ స్థానిక ఇన్‌ఛార్జి పుట్టా సుధాకర్ యాదవ్.. జగన్ అరెస్ట్ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. జగన్‌ అరెస్ట్ చేయడం దుర్గాపు చర్య అని అన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. జగన్‌ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇకపోతే, జగన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మైదుకూరులో ఉంటే లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయని భావించి ప్రొద్దుటూరుకు తరలించారు. దాంతో మైదుకూరు పోలీస్ స్టేషన్ వద్ద జగన్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 75 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, కరోనా కారణంగా వాయిదా పడిన ఈ ఎన్నికల ప్రక్రియను.. ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచే మొదలు పెట్టారు. దీనిక ప్రకారం.. మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. మార్చి 10వ తేదీ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 14వ తేదీన ఓట్ల కౌంటింగ్ ఉంటుంది.

Also read:

India vs England 4th Test: భారత్-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్.. హిట్ మ్యాన్ ఖాతాలో మరో అరుదైన రికార్డ్..!

Assam Elections 2021: అసోం అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ కసరత్తు.. 70 మందితో కూడిన తొలి జాబితా విడుదల