ఆ ఊరిలో ఏనుగు సమాధికి 120 ఏళ్ల చరిత్ర.. ఈ సమాధికి పూజలు కూడా చేస్తారు.. ఎక్కడో తెలుసా..?

| Edited By: Srilakshmi C

Sep 06, 2023 | 5:04 PM

కడప జిల్లా దువ్వూరు మండలం గుడిపాడు లో ఏనుగు సమాధి ఉందని, ఆ సమాధికి విశిష్టమైన ఆధ్యాత్మిక చరిత్ర ఉందని ఆ గ్రామస్తులు చెబుతున్నార.. ఈ విషయం ఆగ్రామస్తులకు తప్ప చాలా మందికి తెలియదు. గుడిపాడులోని పాత జాతీయ రహదారి పక్కన ఈ ఏనుగు సమాధి ఉంది. ఈ ఏనుగు సమాధికి 120 ఏళ్ల ఆసక్తి కరమైన చరిత్ర ఉంది...

ఆ ఊరిలో ఏనుగు సమాధికి 120 ఏళ్ల చరిత్ర.. ఈ సమాధికి పూజలు కూడా చేస్తారు.. ఎక్కడో తెలుసా..?
120 Year Old Elephant Tomb In Gudipadu
Follow us on

కడప, సెప్టెంబర్ 6: కడప జిల్లా దువ్వూరు మండలం గుడిపాడు లో ఏనుగు సమాధి ఉందని, ఆ సమాధికి విశిష్టమైన ఆధ్యాత్మిక చరిత్ర ఉందని ఆ గ్రామస్తులు చెబుతున్నార.. ఈ విషయం ఆగ్రామస్తులకు తప్ప చాలా మందికి తెలియదు. గుడిపాడులోని పాత జాతీయ రహదారి పక్కన ఈ ఏనుగు సమాధి ఉంది. ఈ ఏనుగు సమాధికి 120 ఏళ్ల ఆసక్తి కరమైన చరిత్ర ఉంది.

అహోబిలం మఠానికి దేశంలో అనేక ప్రాంతాల్లో ఆలయాలు ఉన్నాయి. తమిళనాడులోని తంజావూరు జిల్లా కుంభకోణం పట్టణంలో కూడా అహోబిల మఠం, ఆలయం ఉంది. కుంభకోణం నుండి మఠాధిపతులు అహోబిలం సందర్శించేవారు. కుంభకోణం , అహోబిలం క్షేత్రాల మధ్య దూరం 546 కిలోమీటర్లు. పూర్వకాలంలో కాశీ , రామేశ్వరం రహదారిగా పిలువబడిన ప్రస్తుత జాతీయ రహాదారిపై యాత్రీకులు ఏనుగులు, గుర్రాలు, కాలి నడకన ప్రయాణం చేసేవారు. మఠాధిపతులు తమ ప్రయాణాల్లో అచారరీత్యా ఏనుగులు, గుర్రాలతో , ఛత్ర, చామరాలతో ప్రయాణం చేసేవారు. ఇదే రీతిలో 1902 వ సంవత్సరంలో కుంభకోణం నుండి అహోబలం వస్తుండగా మఠాధిపతుల ఏనుగు జబ్బుపడింది. కుంభకోణం నుండి సుమారు 500 కిలో మీటర్లు ప్రయాణించి గుడిపాడు వద్దకు చేరుకున్న ఏనుగు గుడిపాడు వద్ద నిలిచిపోయి ముందుకు వెళ్ళలేక పోయింది. అక్కడినుంచి కదలలేక కన్నుమూసింది.

ఆహోబిలం మఠం నిర్వాహకులు గ్రామస్తుల సహకారంతో ఏనుగును రహదారిపక్కన ఖననం చేశారు. అక్కడ సమాధిని నిర్మించారు. ఏనుగు శిలా విగ్రహాన్ని కూడా సమాధివద్ద ప్రతిష్టించారు. ప్రతి ఏటా వారు అహోబిలం వెళ్ళే సమయంలో ఈ ఏనుగు సహాధి వద్ద ఆగి దానికి పూజ చేసి వెళ్ళే వారని .. కాల క్రమంలో అహోబిలం మఠం వారు ఇటు రావడం మానేశారని అక్కడి గ్రామస్తులు చెబుతున్నారు.. గతంలో అహోబిం మఠంవారు ఇక్కడ ఆగడానికి గల కారణం గుడిపాడులో ఒక కోనేరు ఉంది అక్కడ వారు ఏనుగులు , గుర్రాలను సేదతీరడానికి ఆపేవారని గ్రామస్తులు తెలపుతున్నారు… మాకు ఊహతెలిసి మేము అహోబిం పీఠ వారు ఇటురావడం చూడలేదని మా పెద్దలు చెప్పిన దాని ప్రకారం ఇది 120 ఎళ్ళ నాటి చరిత్ర అని గ్రామస్తులు తెలిపారు.. అదేవిధంగా గ్రామస్తులు కూడా ఇక్కడ మంచి జరగాలని కోబ్బరి కాయలు కోట్టడం , ఎక్కడికన్నా ప్రయాణం అయే టప్పుడు ఏనుగు సమాధి వద్ద ఆగి కోబ్బరికాయ కోట్టడం , పూజలు చేయడం వంటివి చేస్తారని గ్రామస్తులు చెబుతున్నారు .. ఇక్కడ ఏదైనా పని అనుకుని దండం పెట్టుకుని వెళితే విజయం జరుగుతుందనేది గ్రామస్తుల విశ్వాసం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.