IPS Officers Transferred: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 16 మంది ఐపీఎస్‌ల బదిలీ..

IPS Officers Transferred in AP: ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 16 మంది ఐపీఎస్ అధికారులను..

IPS Officers Transferred: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 16 మంది ఐపీఎస్‌ల బదిలీ..
Ips Officers Transferred In Ap
Follow us

|

Updated on: Jul 07, 2021 | 7:28 AM

IPS Officers Transferred in AP: ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 16 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. వారిలో కొంతమందికి పదోన్నతిని కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్ దాస్ మంగళవారం అర్థరాత్రి తర్వాత జీవో జారీ చేశారు.

బదిలీ అయిన స్థానం..

• విజయనగరం ఎస్పీ రాజకుమారికి దిశ డీఐజీగా పదోన్నతి లభించింది. దీంతోపాటు డీజీపీ కార్యాలయంలో అడ్మిన్ డీఐజీగానూ రాజకుమారికి బాధ్యతలు అప్పగించారు. • విజయనగరం ఎస్పీగా ఎం.దీపిక బదిలీ అయ్యారు. • సి.హెచ్.విజయరావు నెల్లూరు ఎస్పీగా బదిలీ అయ్యారు. • ఎం.రవీంద్రనాథ్ బాబు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు. • అద్నాన్ నయీమ్ హస్మిని గ్రే హౌండ్స్ కమాండర్‌గా బదిలీ. • కృష్ణా జిల్లా ఎస్పీగా సిద్ధార్థ్‌ కౌశల్‌‌ను బదిలీ అయ్యారు. • వై. రిశాంత్‌రెడ్డి గుంటూరు రూరల్ అడ్మిన్‌ అదనపు ఎస్పీగా బదిలీ. • సతీశ్‌కుమార్‌ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అదనపు ఎస్పీగా బదిలీ • విద్యాసాగర్‌ నాయుడు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అదనపు ఎస్పీగా పోస్టింగ్‌ • విద్యాసాగర్ నాయుడు ఎస్ఈబీ అదనపు ఎస్పీగా నియమకం. • గరికపాటి బిందు మాధవ్​ను ఎస్ఈబీ అదనపు ఎస్పీగా బదిలీ అయ్యారు. • తుహిన్ సిన్హాను ఎస్ఈబీ అదనపు ఎస్పీగా బదిలీ చేశారు. • పి జగదీష్ విశాఖపట్నం జిల్లా, పాడేరు ఏఎస్పీగా బదిలీ అయ్యారు. • జి కృష్ణకాంత్​తూర్పుగోదావరి జిల్లా, చింతూర్ ఏఎస్పీగా బదిలీ అయ్యారు. • విఎన్. మణికంఠ చందోలు విశాఖపట్నం జిల్లా, నర్సీపట్నం అసిస్టెంట్ ఎస్పీగా బదిలీ అయ్యారు. • కృష్ణకాంత్ పాటిల్ తూర్పుగోదావరి జిల్లా, రంపచోడవరం అసిస్టెంట్ ఎస్పీగా బదిలీ అయ్యారు. • తుషార్ దూడిని విశాఖపట్నం జిల్లా, చింతపల్లి అసిస్టెంట్ ఎస్పీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read:

CM KCR : కృష్ణా జలాల వివాదంపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. తెలంగాణ వాటా కోసం రాజీలేకుండా పోరాడుతామని ప్రకటన

Sonu Sood : సోనుసూద్ కోసం750 కిలోమీటర్లు నడిచి వెళ్లిన వెంకటేష్‌కి గుర్తింపు.. అప్ప్రెసియేషన్ సర్టిఫికెట్, మెడల్‌తో సత్కారం..