AP Cabinet: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నయా టీమ్‌ రెడీ.. 25 మందితో రాజ్‌భవన్‌కు కొత్త జాబితా..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కొత్త టీమ్‌ రెడీ అయ్యింది. పాత, కొత్త కలయికతో తన టీమ్‌ను ఎంపిక చేసుకున్నారు సీఎం జగన్‌. పాత వాళ్లలో పది మంది కంటిన్యూ కానున్నారు.

AP Cabinet: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నయా టీమ్‌ రెడీ.. 25 మందితో రాజ్‌భవన్‌కు కొత్త జాబితా..
Ys Jagan Mohan Reddy
Follow us

|

Updated on: Apr 10, 2022 | 8:20 AM

AP CM YS Jagan new team: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) కొత్త టీమ్‌ రెడీ అయ్యింది. పాత, కొత్త కలయికతో తన టీమ్‌ను ఎంపిక చేసుకున్నారు సీఎం జగన్‌. పాత వాళ్లలో పది మంది కంటిన్యూ కానున్నారు. కొత్తగా 15మంది కేబినెట్‌(AP Cabinet)లోకి రాబోతున్నారు. దాదాపు మూడేళ్ల తరవాత పునర్వ్యవస్థీకరిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ కొత్త మంత్రివర్గంలోకి 15 మంది కొత్తవారు రాబోతున్నారు. ఈ 15మందిలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే ప్రాధాన్యత దక్కబోతోంది. బలహీనవర్గాలకు పెద్ద పీట వేసి వారిని రాజ్యాధికారంలో మరింత కీలక భాగస్వాములను చెయ్యాలనే దిశగా సీఎం జగన్‌ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే 56 శాతం కేబినెట్‌ బెర్తులు వారికే కేటాయించినట్లు తెలుస్తోంది.

మంత్రుల రాజీనామాలను ఆల్రెడీ గవర్నర్‌కు పంపారు సీఎం జగన్‌. కొత్త మంత్రుల జాబితాను ఈ మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు పంపనున్నారు. అలాగే, కేబినెట్‌లో బెర్త్‌ దక్కించుకున్న వారికి ఈరోజే సీఎంవో నుంచి సమాచారం వెళ్లనుంది. దాదాపు మూడేళ్ల తరవాత పునర్వ్యవస్థీకరిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ కొత్త మంత్రివర్గంలోకి 15 మంది కొత్తవారు రాబోతున్నారు. ఇప్పటిదాకా ఉన్న కేబినెట్‌ నుంచి 10 మంది వరకూ… ఆయా జిల్లాల అవసరాలు, సామాజిక కూర్పు, అనుభవం ఆధారంగా ఇకపైనా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా రాష్ట్ర కేబినెట్లో అగ్రవర్ణాలకు చెందిన వారు 44 శాతం ఉండగా… బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారే మెజారిటీ సంఖ్యలో 56 శాతంగా ఉన్నారు. అయితే తాజా పునర్వ్యవస్థీకరణలో బలహీనవర్గాల శాతం మరింతగా పెరిగే అవకాశాలున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాజకీయ అనుభవం, కుల సమీకరణలు, ప్రాంతాల లెక్కల ఆధారంగా కేబినెట్‌ కూర్పు చేశారు సీఎం జగన్‌.

రేపు ఉదయం 11 గంటల 31 నిమిషాలకు కొత్త మంత్రులు ప్రమాణం చేయనున్నారు. మధ్యాహ్నం గవర్నర్‌కు జాబితా పంపించిన అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్‌ చేసి సమాచారమిస్తారని, సోమవారంనాడు అందుబాటులో ఉండాల్సిందిగా కొందరు ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం వెలగపూడి తాత్కాలిక సచివాలయం ఒకటో బ్లాక్‌ పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో వేదికను సిద్ధం చేశారు. ఆహ్వానితులను మాత్రమే కొత్త మంత్రుల ప్రమాణానికి అనుమతించనున్నారు. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక కొత్త, పాత మంత్రులకు, అతిథులకు విందు ఇవ్వనున్నారు సీఎం జగన్‌.

Read Also…  

Srirama Navami: శ్రీరామనవమికి ముస్తాబైన భద్రాద్రి.. రెండేళ్ల తర్వాత భక్తుల నడుమ రాములోరి కళ్యాణం.. పోటెత్తిన భక్తులు

Latest Articles