Andhra: అయ్యో.. NSG కమాండోకి ఏమైంది.. చంద్రబాబు పర్యటనలో అనూహ్య ఘటన
చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్ పర్యటనలో అనూహ్య ఘటన జరిగింది. సీఎం మాట్లాడుతూ ఉండగా ఆయన భద్రతా వలయంలో ఉన్న ఎన్ఎస్జీ కమాండో కళ్ళు తిరిగి కింద పడిపోయారు. దీంతో వెంటనే ఇతర సిబ్బంది అతనికి సపర్యలు చేశారు .. ..
ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు జన్మదినం. ఈ సందర్భంగా సీఎం దంపతులు విజయవాడ పటమట అన్న క్యాంటీన్‌కు వచ్చారు. అక్కడ పేదలకు స్వయంగా అల్పాహారం వడ్డించారు. ఈ పర్యటనలో ఒక్కసారిగా అనూహ్య ఘటన జరిగింది. కార్యక్రమం అనంతరం సీఎం బయట మీడియాతో మాట్లాడుతుండగా.. ఆయన సేఫ్టీ టీంలో భాగమైన NSG కమాండో కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో అప్రమత్తమైన ఇతర భద్రతా సిబ్బంది అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తీవ్రమైన ఎండ నేపథ్యంలో సదరు కమాండో వడదెబ్బకు గురైనట్లు సమాచారం.
Loading...
Unable to load recommendations.
Follow Us