Andhra Pradesh: ఏపీ వాసులకు అలెర్ట్‌.. నేడు, రేపు ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. అప్రమత్తంగా ఉండాల్సిందే

|

Nov 26, 2022 | 2:06 PM

ఉత్తర కోస్తాలో ఈ రోజు, రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది. అలాగే ఎల్లుండి పొడి వాతావరణం ఉంటుంది. ఇక దక్షిణ కోస్తా విషయానికొస్తే.. ఈరోజు నుంచి మూడు రోజుల పాటు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.

Andhra Pradesh: ఏపీ వాసులకు అలెర్ట్‌.. నేడు, రేపు ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. అప్రమత్తంగా ఉండాల్సిందే
Ap Rains
Follow us on

నేటి నుంచి రెండు రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాల నుంచి ఓ మోస్తరు భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపోస్పిరిక్ స్థాయుల్లో తూర్పు, ఈశాన్య గాలులు బలంగా వీయడం వల్ల ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో నేటి నుంచి రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తర కోస్తాలో ఈ రోజు, రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది. అలాగే ఎల్లుండి పొడి వాతావరణం ఉంటుంది. ఇక దక్షిణ కోస్తా విషయానికొస్తే.. ఈరోజు నుంచి మూడు రోజుల పాటు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ఇక రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో మరో మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కాగా శనివారం నుంచి  ఏపీతో పాటు తెలంగాణలో చలిగాలులు మరింత విజృంభిస్తాయని, మరో అల్పపీడనం ఏర్పడే వరకు ఇదే కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో విపరీతమైన పొగమంచు కురుస్తుందని పేర్కొన్నారు. ఏపీలో తిరుపతి, విశాఖపట్నం, నెల్లూరు తదితర ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంది. ఇక తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చాలా ప్రాంతాలు పొగమంచు దుప్పట్లోనే ఉంటున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు కూడా భారీగా పడిపోతున్నాయి.

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి