TDP MLCs : టీడీపీ ఎమ్మెల్సీల ఢిల్లీ పర్యటన వాయిదా..ఎందుకంటే..?

|

Feb 18, 2020 | 9:11 AM

TDP MLCs :శాసన మండలి రద్దు సహా వివిధ రాజకీయ అంశాలపై ఫిర్యాదు చేసేందుకు టీడీపీ ఎమ్మెల్సీలు తలపెట్టిన ఢిల్లీ పర్యటన వాయిదా పడింది.  ముందుగా ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్ ప్రకారం నేడు(మంగళవారం) నేతలు హస్తినకు వెళ్లాల్సి ఉంది. రెండు రోజులు అక్కడే ఉండి.. ప్రధాని సహా.. హో మంత్రి, కేంద్ర మంత్రులను కలవాలని నిర్ణయించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మినహా మిగతావారి అపాయింట్‌మెంట్ వారికి దొరకలేదు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీలు పర్యటనను వాయిదా వేసుకున్నారు. […]

TDP MLCs : టీడీపీ ఎమ్మెల్సీల ఢిల్లీ పర్యటన వాయిదా..ఎందుకంటే..?
Follow us on

TDP MLCs :శాసన మండలి రద్దు సహా వివిధ రాజకీయ అంశాలపై ఫిర్యాదు చేసేందుకు టీడీపీ ఎమ్మెల్సీలు తలపెట్టిన ఢిల్లీ పర్యటన వాయిదా పడింది.  ముందుగా ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్ ప్రకారం నేడు(మంగళవారం) నేతలు హస్తినకు వెళ్లాల్సి ఉంది. రెండు రోజులు అక్కడే ఉండి.. ప్రధాని సహా.. హో మంత్రి, కేంద్ర మంత్రులను కలవాలని నిర్ణయించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మినహా మిగతావారి అపాయింట్‌మెంట్ వారికి దొరకలేదు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీలు పర్యటనను వాయిదా వేసుకున్నారు.

శాసనమండలి రద్దుతో పాటు, మూడు రాజధానుల అంశం, అమరావతి రైతుల ఉద్యమం వంటి విషయాలను ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని టీడీపీ ప్రయత్నించింది. అయితే గత వారం రెండు సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్..ప్రధాని, హోంమంత్రితో పాటు కేంద్ర మంత్రులను కలిశారు. శాసనమండలి రద్దుకు సహకరించాలని ఆయన కోరినట్టు వార్తలు వినిపించాయి. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీల పర్యటన వాయిదా పడటంతో..ఏపీ ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: ప్రశాంత్‌ కిశోర్‌కు ‘జడ్‌ కేటగిరీ’ భద్రత..!