Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 24 వేల 850 మంది వైరస్​ సోకింది. మరో 613 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,73,165. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు2,44,814. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 4,09,083. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 19,268.
  • కోవిడ్-19 వార్ రూమ్ ఏర్పాటు చేయనున్న ఢిల్లీ సర్కారు
  • డీఆర్డీవో నిర్మించిన ఆస్పత్రిలో అన్ని రకాల సదుపాయాలున్నాయి. ఇక్కడ వైద్యం పూర్తిగా ఉచితం. ఆర్మీ వైద్యులు సైవలందిస్తారు. కంటోన్మెంట్లోని చెత్త డంపింగ్ ప్రాంతాన్ని చదును చేసి సర్దార్ పటేల్ ఆస్పత్రిగా మార్చాం. డీఆర్డీవో ఇప్పటి వరకు 70 రకాల దేశీయ వైద్య ఉత్పత్తులు తయారు చేసింది. నెలకు 25,000 వెంటిలేటర్లు తయారు చేసే సామర్థ్యం కలిగి ఉన్నాం. దేశీయ అవసరాలు పోను ఎగుమతి చేసేందుకు కూడా సిద్ధం. జి. సతీశ్ రెడ్డి, డీఆర్డీఓ ఛైర్మన్.
  • రేపటి నుండి తెరుచుకోనున్న హైదరాబాద్లోని పలు మార్కెట్లు. బేగంబజార్ ట్రూప్ బజార్,జనరల్ బజార్ మార్కెట్లు. కరోనా భయం తో స్వచ్చందంగా షాప్స్ మూసేసి షొప్స్ యజమానులు . 10 రోజుల తరువాత రెపటినుండి యధాతధంగా నడవనున్న మార్కెట్లు.
  • చెన్నై : హాస్పిటల్ మూసివేత. చెన్నైలోని విజయా హాస్పిటల్లో కరోనా కలకలం. 50 మందికి పైగా హాస్పిటల్ సిబ్బందికి కరోనా పాజిటివ్. కరోనా తో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ శరత్ రెడ్డి మృతి. హాస్పిటల్ ఈమెర్జెన్సీ సర్వీసులు నిలిపివేత. హాస్పిటల్లో ఉన్న ఇన్ పేషేంట్ లను ఇతర హాస్పిటల్స్ కు తరలింపు. హాస్పిటల్ లో సిబ్బందికి, వచ్చిన రోగులకు కరోనా టెస్టులు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుంచి తరచూ వైద్యం కోసం విజయ హాస్పిటల్ కు వెళుతున్న వారిలో ఆందోళన.
  • రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో ప్రధాని మోదీ భేటీ. లద్దాఖ్ పర్యటన నుంచి తిరిగొచ్చిన వెంటనే భేటీ. సరిహద్దు ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మద్ధతు సహా పలు అంశాలపై చర్చ.

Political Strategist : ప్రశాంత్‌ కిశోర్‌కు ‘జడ్‌ కేటగిరీ’ భద్రత..!

Political Strategist : Mamata Banerjee Govt to Provide 'Z' Category Security Cover to Political Strategist Prashant Kishor, Political Strategist : ప్రశాంత్‌ కిశోర్‌కు ‘జడ్‌ కేటగిరీ’ భద్రత..!

Political Strategist : ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, ఐఫ్యాక్ సంస్థ అధినేత ప్రశాంత్ కిశోర్‌(పీకే)కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జడ్‌ కేటగిరీ భద్రత కల్పించబోతున్నట్లు పొలిటికల్ సర్కిల్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తృణమూల్ కాంగ్రెస్ వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం అందుతోంది. అందుకు తగ్గట్టుగానే పీకే.. మీడియా చేస్తోన్న ఫోన్ కాల్స్‌కి కూడా సమాధానం ఇవ్వడం లేదు.  2019 లోక్‌సభ ఎన్నికలలో టీఎంసీ ఘోరంగా విఫలమైన తర్వాత,  పీకేను రాజకీయ వ్యూహకర్తగా నియమించుకుంది. అందుకు తగ్గట్టుగానే బెంగాల్‌లో గత ఏడాది నవంబర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో టిఎంసి మొత్తం మూడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. 

కాగా పశ్చిమ బెంగాల్‌లో ప్రజా జీవితంతో ఎటువంటి సంబంధం లేనప్పటికీ, కిషోర్‌కు రాష్ట్ర ప్రభుత్వ వ్యయంతో ‘జెడ్’ కేటగిరీ భద్రత ఎందుకు కల్పిస్తున్నారని సిపిఐ (ఎం) శాసనసభ పార్టీ నాయకుడు సుజన్ చక్రవర్తి ప్రశ్నించారు. ఇక జెడి (యు) గత నెలలో..  ఉపాధ్యక్షుడిగా సేవలందిస్తోన్న కిశోర్‌ను..పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండటం లేదన్న కారణంతో బహిష్కరించింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మాదిరిగానే కిషోర్ పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్‌పిఆర్) పై తీవ్ర విమర్శలు చేశారు. 

Related Tags