బాబు ఇంకా పుడుంగి అనుకుంటున్నారు: బొత్స సెటైర్లు

రాజధాని అమరావతి ప్రాజెక్ట్ విషయంలో సింగపూర్ ప్రతినిధులు ఎందుకు వైదొలిగారన్న దానిపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టతను ఇచ్చారు. అసెంబ్లీలో రాజధానిపై జరిగిన చర్చలో భాగంగా మాట్లాడిన బొత్స.. రాజధానిపై చంద్రబాబు చెబుతున్నవన్నీ అసత్యాలేనని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత సింగపూర్ ప్రతినిధులు రెండు, మూడు సార్లు తనను, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని కలిశారని బొత్స తెలిపారు. ఆ సందర్భంగా తాము వారిని ప్రత్యేకంగా ఏమీ కోరలేదని.. కానీ సంపద ఎలా […]

బాబు ఇంకా పుడుంగి అనుకుంటున్నారు: బొత్స సెటైర్లు
Follow us

| Edited By:

Updated on: Dec 17, 2019 | 6:52 PM

రాజధాని అమరావతి ప్రాజెక్ట్ విషయంలో సింగపూర్ ప్రతినిధులు ఎందుకు వైదొలిగారన్న దానిపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టతను ఇచ్చారు. అసెంబ్లీలో రాజధానిపై జరిగిన చర్చలో భాగంగా మాట్లాడిన బొత్స.. రాజధానిపై చంద్రబాబు చెబుతున్నవన్నీ అసత్యాలేనని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత సింగపూర్ ప్రతినిధులు రెండు, మూడు సార్లు తనను, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని కలిశారని బొత్స తెలిపారు. ఆ సందర్భంగా తాము వారిని ప్రత్యేకంగా ఏమీ కోరలేదని.. కానీ సంపద ఎలా సృష్టిస్తారో చెప్పాలని మాత్రమే అడిగామని, అది తమకు నచ్చితే ముందుకు వెళ్తామని చెప్పామని పేర్కొన్నారు. అయితే ఆ ప్రశ్నకు వారి వద్ద నుంచి సరైన సమాధానం లేదని, దీంతో పరస్పర అంగీకారంతోనే వారు ఈ ప్రాజెక్ట్‌ నుంచి వైదొలిగినట్లు తెలిపారు. అమరావతి ప్రాజెక్ట్‌పై సింగపూర్ ప్రతినిధులతో జరిగిందేనని ఆయన క్లారిటీ ఇచ్చారు.

ఇక ఇదే విషయంపై కావాలంటే సింగపూర్ ప్రతినిధులను తీసుకువచ్చి అడగొచ్చని.. ఈ ప్రాజెక్ట్‌పై తాము చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉందంటే దేనికైనా ఒప్పుకుంటామని బొత్స సవాల్ విసిరారు. రాజధానిపై టీడీపీ నేతలకు ఇంతకన్నా ఇంకేం అర్థం కావాలని ఆయన ప్రశ్నించారు. అమరావతి ప్రాజెక్ట్‌పై ఓసారి ఎంవోయూ అంటూ, మరోసారి స్విస్ ఛాలెంజ్ అంటూ టీడీపీ నేతలు మాటలు మారుస్తున్నారని, అసలు ఒక్క మాట మీద నిలబడటం లేదని మండిపడ్డారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై బొత్స విరుచుకుపడ్డారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత రాష్ట్రానికి బాబు ముఖ్యమంత్రి కావడం ఏపీ ప్రజల ధౌర్భాగ్యమని, ఈయన చేసిన పనులకు ప్రజలు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పారని విమర్శించారు. కానీ ఆయన మాత్రం ఇంకా తాను పుడుంగి అనుకుంటున్నారని సెటైర్లు వేశారు.

చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!