ఏపీ ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు ఆకస్మిక బదిలీ..!

ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు‌ను ఆకస్మికంగా బదిలీ చేసింది జగన్ ప్రభుత్వం. ఒక పక్క ఆర్టీసీని.. ప్రభుత్వంలో.. విలీనం చేస్తున్న నేపథ్యంలో.. ఏపీ గవర్నమెంట్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కాస్త ఆశ్చర్యంగా ఉంది. 1987 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన సురేంద్రబాబుకు పోస్టింగ్ కూడా ఇవ్వకుండా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా.. సురేంద్రబాబు ప్లేస్‌లో.. నూతన ఆర్టీసీ ఎండీగా రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి ఎమ్‌టీ కృష్ణబాబును ప్రభుత్వం నియమించింది. చేనేత జౌళి శాఖ కార్యదర్శిగా […]

ఏపీ ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు ఆకస్మిక బదిలీ..!

Edited By:

Updated on: Sep 25, 2019 | 7:34 PM

ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు‌ను ఆకస్మికంగా బదిలీ చేసింది జగన్ ప్రభుత్వం. ఒక పక్క ఆర్టీసీని.. ప్రభుత్వంలో.. విలీనం చేస్తున్న నేపథ్యంలో.. ఏపీ గవర్నమెంట్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కాస్త ఆశ్చర్యంగా ఉంది. 1987 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన సురేంద్రబాబుకు పోస్టింగ్ కూడా ఇవ్వకుండా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా.. సురేంద్రబాబు ప్లేస్‌లో.. నూతన ఆర్టీసీ ఎండీగా రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి ఎమ్‌టీ కృష్ణబాబును ప్రభుత్వం నియమించింది. చేనేత జౌళి శాఖ కార్యదర్శిగా సీఎం కార్యాలయ కార్యదర్శి జే మురళికి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకూ ఉన్న సురేంద్ర బాబును బదిలీ చేస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయనను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది.

Loading...
Unable to load recommendations.
Follow Us