గ్యాస్ లీకేజీ ఎఫెక్ట్: ఏపీ ప్రభుత్వం న్యూ డెసిషన్.. డోర్‌ టూ డోర్ సర్వీస్

విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన.. దేశ వ్యాప్తంగా చర్చకు వచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు స్పందించారంటే అది ఎంత తీవ్రంగా ఎఫెక్ట్ చూపించిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పటికీ అక్కడి స్థానికుల్లో ఆందోళన కొనసాగుతూనే ఉంది. దాదాపు లక్ష మంది వారి ఇళ్లకు తాళాలు వేసి.. ఇతర ఊళ్లకు తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసకుంది. ఘటనకు సంబంధించిన బాధితులను […]

గ్యాస్ లీకేజీ ఎఫెక్ట్: ఏపీ ప్రభుత్వం న్యూ డెసిషన్.. డోర్‌ టూ డోర్ సర్వీస్
Follow us

| Edited By:

Updated on: May 10, 2020 | 11:42 AM

విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన.. దేశ వ్యాప్తంగా చర్చకు వచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు స్పందించారంటే అది ఎంత తీవ్రంగా ఎఫెక్ట్ చూపించిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పటికీ అక్కడి స్థానికుల్లో ఆందోళన కొనసాగుతూనే ఉంది. దాదాపు లక్ష మంది వారి ఇళ్లకు తాళాలు వేసి.. ఇతర ఊళ్లకు తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసకుంది. ఘటనకు సంబంధించిన బాధితులను గుర్తించేందుకు డోర్ టూ డోర్ సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ సందర్భంగా ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలో పరిస్థితులు అదుపులోకి వచ్చాయన్నారు. మరో 48 గంటలు దాటితే విశాఖలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆయన తెలిపారు. అలాగే చుట్టుపక్కల 5 గ్రామాల బాధితులను గుర్తించేందుకు డోర్ టూ డోర్ సర్వే చేపట్టబోతున్నామన్నారు. పరిస్థితిని చక్కబెట్టేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోందని మంత్రి గౌతమ్ రెడ్డి వివరించారు. ప్రమాదం జరిగిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ధైర్యంగా ఉండాలని ఆయన సూచించారు. అలాగే సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వార్తలను నమ్మవద్దన్నారు.

అలాగే మరో ఏపీ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. ఘటనను పరిశీలించేందుకు కేంద్ర కమిటీ విశాఖకు చేరుకుందన్నారు. అదే విధంగా నాగపూర్‌ నుంచి ఒక బృందం వచ్చిందన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కమిటీని నియమించిందని మంత్రి చెప్పారు. ఆదివారం నుంచే ఈ కమిటీ తన పని మొదలు పెడుతుంద్నారు. విశాఖ ఘటనలో ఇప్పటివరకూ 588 మంది అడ్మిట్ అయ్యారని.. 111 మంది డిశ్చార్జ్ అయ్యారని మంత్రి పేర్కొన్నారు. అలాగే విశాఖలో ఉన్న అన్ని కెమికల్ పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు మంత్రి కన్నబాబు.

Read More:

ఈ రోజు రాత్రికే గుడిలో ప్రొడ్యూసర్ దిల్ రాజు రెండో పెళ్లి..

గుండెపోటుతో యంగ్ డైరెక్టర్ మృతి.. షాక్‌లో సినీ ప్రముఖులు

మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?