ఆకాశంలో అత్యధిక దూరం ప్రయాణించిన విమానంగా ఆ ‘ లోహవిహంగం ‘ పాపులర్ అయింది. ‘ క్వాంటాస్ ‘ ప్లేన్ గా వ్యవహరించే ఈ విమానం ప్రపంచ విమానాల్లోకెల్లా అత్యంత పెద్దదట. న్యూయార్క్ నుంచి ఇది ఆస్ట్రేలియా కు ఆదివారం ఉదయం చేరుకుంది. క్వాంటాస్
సీఈఓ అలాన్ జాయ్స్ తో సహా సుమారు 49 మంది ఈ భారీ లోహ విహంగంలో ప్రయాణించారు. ఎక్కడా ఆగకుండా, తిరిగి ఇంధనం నింపుకోకుండా ఇది 16 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. బరువు చాలా తక్కువగా ఉండేలా చూసేందుకు కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రయాణించారు అంతా.. ఇది రియల్లీ హిస్టారిక్ మూమెంట్ అని అభివర్ణించారు అలాన్ జాయ్స్ . అంతదూరం ప్రయాణించి వచ్చ్చాక ఇక వీరంతా సిడ్నీ విమానాశ్రయంలో ఈ భారీ విమానం వద్ద నిలబడి ఫోటోలకు పోజులిచ్చారు. నలుగురు పైలట్లు విరామమెరుగక దీన్ని నడిపారట..