వరదలు, పెనుగాలులతో అమెరికాలోని రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు సహాయ చర్యలు ముమ్మరం చేశారు. అమెరికాలోని ఇలినాయిస్, ఐఓవా రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. 1993 తర్వాత ఎన్నడూ లేని స్థాయిలో మిసిసిపీ నదికి వర్షపు నీరు పోటెత్తింది. ఐయోవాలోని బఫెలోలో నదీ ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక ఇళ్లలోకి నీరు ప్రవేశించింది.
ఇల్లినాయిస్ రాష్ట్రం గ్రాఫ్టన్లో కొన్ని రహదారులు కాలువలను తలపిస్తున్నాయి. అనేక మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్కాన్సస్ రాష్ట్రంలో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. టోర్నడో ధాటికి కొన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఒకరు గాయపడ్డారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.