Kalpana Second and Last Flight: రెండోసారి అంతరిక్షయాత్రకు జనవరి 16న బయలు దేరిన కల్పన చావ్లా .. అదే చివరి యాత్ర

|

Jan 16, 2021 | 4:28 PM

కల్పనా చావ్లా అంతరిక్షంలోకి వెళ్ళి భారతీయ సంతతికి చెందిన మొదటి మహిళా వ్యోమగామి. 2003 జనవరిలో రెండోసారి అంతరిక్షంలోకి వెళ్లి 16 రోజులు గడిపి 80 ప్రయోగాలను విజయవంతంగా..

Kalpana Second and Last Flight: రెండోసారి అంతరిక్షయాత్రకు జనవరి 16న బయలు దేరిన కల్పన చావ్లా .. అదే చివరి యాత్ర
Follow us on

Kalpana Second and Last Flight: కల్పనా చావ్లా అంతరిక్షంలోకి వెళ్ళి భారతీయ సంతతికి చెందిన మొదటి మహిళా వ్యోమగామి. 2003 జనవరిలో రెండోసారి అంతరిక్షంలోకి వెళ్లి 16 రోజులు గడిపి 80 ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించారు. ఆయాత్ర ముగించుకుని వస్తుండగా 2003 ఫిబ్రవరి 1 న కొలంబియా వ్యోమనౌక కూలిపోవడంతో ఆమెతోపాటు మరో ఆరుగురు వ్యోమగాములు దుర్మరణం పాలయ్యారు. జనవరి 16 నుండి ప్రారంభమైన ఈ మిషన్ 16 రోజులపాటు సాగింది.

కల్పన 1995 లో నాసాలో వ్యోమగామిగా చేరారు. మొదటి అంతరిక్ష మిషన్ ను 1997 నవంబరు 19న ప్రారంభమైంది. ఆ తర్వాత తన టీమ్ తో కలిసి ఈ యాత్రకు వెళ్లిన కల్పనా 5 డిసెంబర్ 1997 వరకు అంతరిక్షంలోనే ఉన్నారు. ఈ యాత్రంలో కల్పన 1.04 మిలియన్ మైళ్లు ప్రయాణించారు. మొదటి మిషన్ సమయంలో 372 గంటలు అంతరిక్షంలో గడిపారు. దీంతో అంతరిక్షానికి చేరుకున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు.

బాల్యం నుంచి వ్యోమగామి కావాలని కలలు కన్న కల్పనా చావ్లా.. తన కలను నెరవేర్చుకునేందుకు చండీగఢ్ లోని పంజాబ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ లో బీటెక్ పూర్తి చేశారు. ఆ తర్వాత 1982లో నాసాలో చేరాలన్న లక్ష్యంతో అమెరికా వెళ్లారు. అక్కడ ఆమె టెక్సాస్ విశ్వవిద్యాలయం నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో ఏం.టెచ్ మరియు తరువాత కొలరాడో విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టాపుచ్చుకున్నారు. అనంతరం కల్పనా చావ్లా 1988లో నాసాలో చేరారు.

వ్యోమగామి కావాలన్న తన కలను నెరవేర్చుకోవడానికి సప్త సముద్రాలు దాటిన కల్పన చావ్లా రెండోసారి అంతరిక్షంలో అడుగు పెట్టారు. దీంతో కల్పనా పేరు భారత దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగింది., అమ్మాయిల కలలకు రెక్కలు ఇస్తే.. ఎంతటి లక్ష్యాన్ని అయినా సాధిస్తారు అంటూ ప్రశంసల వర్షం కురిసింది.

హరియాణాలోని కర్నాల్‌లో ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కల్పనా ప్రపంచ చరిత్రలో తనకంటూ ఓ పేజీని లిఖించుకుని చిన్న వయసులోనే మరణించారు. ఆమె గౌరవార్ధం తమిళనాడు ప్రభుత్వం కల్పనా చావ్లా పురస్కారాన్ని 2003 నుంచి ఏటా ప్రకటిస్తోంది.దీన్ని వివిధ రంగాల్లో 15 మంది శక్తివంతమైన మహిళకు అందజేస్తుంది. భారతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం 2003లో ప్రయోగించిన మెట్ శాట్‌కు కల్పనా చావ్లా పేరు పెట్టారు. అంతరిక్షయానం చేసిన తొలి ఇండో-అమెరికన్ మహిళ వ్యోమగామిగా చరిత్ర సృష్టించారు.

Also Read:
దేశ ఆర్ధిక రాజధాని ముంబై లో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా.. పాఠశాల మూసివేత