అమెరికా రాజధాని న్యూయార్క్ కరెంట్ కోతతో అల్లాడిపోయింది. దాదాపు ఆరు గంటల పాటు విద్యుత్ నిలిచిపోయి అంధకారం ఆవహించింది. ఈ సమయంలో అక్కడక్కడా దోపిడీలు జరగడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సాంకేతిక సమస్యలే ఈ విద్యుత్ కోతకు కారణమని అధికారులు తెలిపారు. 1977 తరువాత ఈ స్థాయిలో పవర్ కట్ ఇదే మొదటిసారని వారు చెబుతున్నారు.