అమెరికాను తుఫాన్ కుదిపేస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రచండ గాలులు వీస్తున్నాయి. తీవ్ర గాలులతో పాటు వడగళ్లతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో అనేక చోట్ల భారీ వృక్షాలు విరిగి రోడ్లపై పడిపోయాయి. విద్యుత్ స్థంభాలు నేలకూలాయి. దీంతో పలు ప్రాంతాలు అంధకారంలో అల్లాడుతూ.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.