Breaking News
  • హైదరాబాద్: జర్నలిస్టులందరికీ హెల్త్‌ కార్డులు అందించాలి, అన్ని ఆస్పత్రుల్లో సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఈనెల 20 నుంచి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు టీయూడబ్ల్యూజే వినతి పత్రాలు-టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్‌ అలీ.
  • ఆసియాలోనే లైఫ్‌ సైన్సెస్‌కు ప్రధాన కేంద్రంగా హైదరాబాద్‌ మారింది. ప్రపంచ వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో మూడో వంతు హైదరాబాద్‌ సరఫరా చేస్తోంది. జాతీయ ఫార్మా ఉత్పత్తిలో హైదరాబాద్‌ వాటా 35శాతం-మంత్రి కేటీఆర్‌.
  • యాదాద్రి: గుండాల మండలం సుద్దాల దగ్గర ప్రమాదం, కారు, బైక్‌ ఢీకొని ఇద్దరు మృతి, ఒకరికి తీవ్రగాయాలు.
  • విజయవాడ: ఎమ్మార్వో వనజాక్షిపై టూటౌన్ పీఎస్‌లో ఫిర్యాదు, తమను కులం పేరుతో దూషించిందని ఫిర్యాదు చేసిన మహిళా రైతులు.
  • మహబూబాబాద్: పోడు భూముల ఆక్రమణదారులకు కలెక్టర్‌ హెచ్చరిక. 10 ఎకరాలకు మించి పోడు భూములు ఆక్రమించిన 119 మంది. ఆక్రమణదారుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, నేతలు, కుల సంఘాల నేతలు. భూములు వెంటనే తిరిగి అప్పగించాలని కలెక్టర్ ఆదేశం. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరిక.
  • ప్రాణం తీసిన సెల్ఫీ. కృష్ణాజిల్లా: నూజివీడులో విషాదం. సూరంపల్లి కాలువ దగ్గర సెల్ఫీ దిగేందుకు యువకుడు యత్నం. ప్రమాదవశాత్తు కాలువలో పడి యువకుడు మృతి. బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న పవన్‌.

సెట్స్‌లో కొట్టకున్న అక్షయ్ కుమార్, రోహిత్ శెట్టి..అసలు ఏమైంది..?

Akshay Kumar refutes report of fallout with Rohit Shetty with hilarious reaction video featuring Katrina Kaif, సెట్స్‌లో కొట్టకున్న అక్షయ్ కుమార్,  రోహిత్ శెట్టి..అసలు ఏమైంది..?

బాలీవుడ్ కిలాడి హీరో..అగ్ర దర్శకుడు రోహిత్ శెట్టి ఇద్దరూ సినిమా షూటింగ్ సెట్‌లో దెబ్బలాడుకున్నారు. అది కూడా సాదాసీదాగా కూడా కాదు. అటు 10మంది..ఇటు 10 మంది వచ్చి విడదీస్తే కానీ గొడవ సద్దుమణగలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అసలు ఏమైందనేగా మీ డౌబ్డ్..? అక్కడికే వస్తున్నాం..

కిలాడి హీరో అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా లో బ్యాగ్రౌండ్ వచ్చిన అక్షయ్..బాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగారు. అంతేకాదు వివిధ సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ తన మంచి మనసును చాటుకుంటున్నాడు. ఇక అక్షయ్ సెట్స్‌లో ఎంతో జోవియల్‌గా, ఏమాత్రం ఇగో లేకుండా అందరిని ఒకేలా ట్రీట్ చేస్తారని టాక్.

ప్రస్తుతం అక్షయ్..’సూర్యవంశీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీని బాలీవుడ్ అగ్రదర్శకుడు రోహిత్ శెట్టి డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే మూవీ సెట్స్‌లో అక్షయ్, రోహిత్ శెట్టి కొట్టుకున్నారని..ఇద్దరి మధ్య క్రియేటీవ్ డిఫరెన్సెస్ వచ్చాయని..ఓ  వార్తా సంస్థ కథనాన్ని రాసింది. దీంతో అక్షయ్..సదరు సంస్థకు ఫన్నీ వేలో కౌంటరిస్తూ..సెట్‌లో కొట్టుకుంటున్నట్లు తీసిన వీడియోను సోషల్ మీడియాలో ఫోస్ట్ చేశాడు. దీంతో అటు ప్రమోషన్‌తో పాటు..తమ మధ్య ఏం విభేదాలు లేవని క్లియర్‌గా చెప్పేశాడు అక్షయ్. ఈ వీడియో చూసి కిలాడీ హీరోనా..మాజాకా అంటూ నెటిజన్లు కౌంటర్ వేస్తున్నారు.