రైతు బిల్లులకు నిరసనగా ఎన్డీయే నుంచి అకాలీదళ్ ఔట్

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే నుంచి అకాలీదళ్ వైదొలగింది. వివాదాస్పద రైతు బిల్లులను ప్రభుత్వం తెచ్చినందుకు నిరసనగా తామీ నిర్ణయం తీసుకున్నట్టు అకాలీదళ్ చీఫ్ సుఖ్ బీర్ సింగ్ బాదల్ తెలిపారు. ఈ బిల్లులను..

రైతు బిల్లులకు నిరసనగా ఎన్డీయే నుంచి అకాలీదళ్ ఔట్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 27, 2020 | 9:48 AM

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే నుంచి అకాలీదళ్ వైదొలగింది. వివాదాస్పద రైతు బిల్లులను ప్రభుత్వం తెచ్చినందుకు నిరసనగా తామీ నిర్ణయం తీసుకున్నట్టు అకాలీదళ్ చీఫ్ సుఖ్ బీర్ సింగ్ బాదల్ తెలిపారు. ఈ బిల్లులను ఆమోదించవద్దని ఆయన గతంలోనే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ని కోరారు. గతరాత్రి అకాలీదళ్ నిర్వహించిన అత్యవసర సమావేశంలో.. ఎన్డీయే నుంచి తప్పుకోవాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ బిల్లులు రైతుల ప్రయోజనాలను కాలరాస్తాయని సుఖ్ బీర్ సింగ్ వ్యాఖ్యానించారు. తాము వారి పక్షాన పోరాడుతామన్నారు. ఈయన భార్య హర్ సిమ్రత్ కౌర్ బాదల్ ఇటీవల కేంద్ర మంత్రివర్గానికి రాజీనామా చేశారు. ఎన్డీయే నుంచి మొదట శివసేన, టీడీపీ వైదొలగిన తరువాత ఇప్పుడు అకాలీదళ్ కూడా తప్పుకుంది.